బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త వైరలవుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం పీసీ తన ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ నుంచి చోప్రా జొనాస్ పేరును తొలగించింది. ఇంకేముంది నెటిజనులు.. ఈ జంట కూడా విడాకులు తీసుకొబోతున్నారని.. అందుకే ప్రియాంక తన పేరు నుంచి భర్త ఇంటి పేరును తొలగించిందనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.
ఇది కూడా చదవండి : అలా పిలవకండి అంటూ.. మీడియాపై ప్రియాంక చోప్రా సీరియస్!
ఈ వార్తలపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించారు. తన కుమార్తె, అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారని.. వారకి విడిపోయే ఆలోచన లేదని.. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. అయితే ఈ వార్తలపై ప్రియాకం మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి : రిచ్చెస్ట్ ఇన్ స్టాగ్రామర్ గా ప్రియాంక, ఒక్కో పోస్ట్ కు కోట్లు సంపాదిస్తున్న స్టార్స్
ఈ క్రమంలో తాజాగా ప్రియాంక టైమ్స్‌ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. తాను ఏదో సరదాకు చేసిన పని కూడా ఇంత సీరియస్ అవుతుందని ఊహించలేదు అన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ రెండింటిలో ఒకే పేరు ఉండాలనే ఉద్దేశంతోనే చోప్రా జొనాస్ పేరు తొలగించానని.. కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటారని అనుకోలేదు అని పీసీ తెలిపారు.