ఫిల్మ్ డెస్క్- పూజా హెగ్డే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఈ బుట్టబొమ్మ ఉంటే సినిమా హిట్టేనన్న సెంటిమెంట్ తో ఉన్నారు కొందరు నిర్మాతలు, హీరోలు. అందుకే పూజాకు పరిశ్రమలో కాస్త డిమాండ్ ఎక్కువ. అన్నట్లు పూజా సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈమె చేసే కొంటె పనులకు అభిమానులంతా ఫిదా అవుతుంటారు. పూజా హెగ్డే సోషల్ మీడియాలో సినిమాలకంటే కూడా తన పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది.
కరోనా నేపధ్యంలో ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిన ఈ బుట్టబొమ్మ తన కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా పూజా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. తన ఇంటికి వచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ గురించి చెబుతూ ఓ పోస్ట్ చేసింది పూజా హెగ్డే . సాధారనంగా అయితే క్రిస్మస్ వస్తే ఇలాంటివి ఇంటికి వస్తుంటాయని ఆమె చెప్పింది. వచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా యాపిల్ కంపెనీ నుంచి మ్యాక్ కంప్యూటర్ పూజా హగ్డే ఇంట్లోకి వచ్చేసింది. అలాంటి కొత్త వస్తువులను ముందుగా తామే ఓపెన్ చేయాలని చిన్నతనంలో అల్లరి చేస్తుంటారు కదా.
అలా పూజా హెగ్డేకు కూడా కొత్తవి ఓపెన్ చేయడమంటే ఇష్టమున్నట్లు అర్ధమవుతోంది. అందుకు అనుగునంగానే ఇలాంటి కొత్త వస్తువులను ఓపెన్ చేయడంలోనే భలే మజా ఉంటుందని పూజా హెగ్డే చెప్పింది. కొత్త మ్యాక్ కంప్యూటర్‌ను తాను ప్రారంభించినట్టు చెబుతూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అన్నట్లు ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో చాలా బిజీగా ఉంది. ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ సినిమాలను చేస్తోంది పూజా. ఇక సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించేందుకు రెడీ అయ్యిందీ బుట్టబొమ్మ.