విరూపాక్ష సక్సెస్ తో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సందర్భంగా ట్విట్టర్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ సందడి చేసాడు. మరి సుప్రీం హీరో మనసులో ఇంకా ఏమున్నాయంటే?
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ మెగా హీరో నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఇటీవలే విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. రిలీజైన ప్రతిచోటా పాజిటీవ్ టాక్ రావడంతో ఈ మూవీ సక్సెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేశారు. సంయుక్త మీనన్ జోడిగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉండగా..ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ సందడి చేసాడు. మరి సుప్రీం హీరో మనసులో ఇంకా ఏమున్నాయో తెలుసుకోవాలంటే కింద చదివేయాల్సిందే.
ఇందులో భాగంగా మీ నెక్స్ట్ సినిమా ఏమిటి ?అని అడగగా.. సాయి ధరమ్ తేజ్ కొత్త దర్శకుడితో ఒక లవ్లీ ఫ్యామిలీ మూవీ చేస్తున్నాను. జయంత్ ఈ సినిమాకి దర్శకుడు అని చెప్పుకొచ్చాడు. సత్య మీ ప్రస్తుత క్రష్ ఎవరు అని అడిగితే.. సమంతా అంటూ సమాధానమిచ్చాడు ఈ సుప్రీం హీరో. ఇక మెగా ఫ్యామిలీ కాకుండా తేజ్ కి నచ్చిన ఇద్దరు హీరోలు ఎవరు అని ఎదురైన ప్రశ్నకి రవి తేజ, ప్రభాస్ అని జవాబిచ్చాడు. ఇక మీకు నచ్చిన తమిళ్ డైరెక్టర్ ఎవరు ? అందరూ అని మాత్రం సమాధానం చెప్పకండి. “మణి రత్నం నాకు ఇష్టమైన డైరెక్టర్. అలాగే లోకేష్ కనగ రాజ్, మిత్రన్ డైరెక్షన్ లో నటించాలనుకుంటున్న” అని తెలియజేశాడు. ఇక చివరగా మీ ఫ్యాన్స్ కి వెబ్ సిరీస్ లలో వీటిని రికమెండ్ చేస్తారు అనే దానికి బ్రేకింగ్ బ్యాడ్, బ్రేకింగ్ థ్రోన్స్ అని ఈ సందర్భంగా తెలియజేశాడు.