ఒకప్పుడు సినిమాని అంతా వినోదంగానే చూసేవారు. కానీ.., తరువాత అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యింది. మా హీరో సినిమా ఇన్ని సెంటర్స్ లో ఇన్ని రోజులు ఆడింది అంటూ.. రికార్డ్స్ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. చాలా కాలం వరకు ఈ ట్రెండ్ నడిచింది. అయితే.. ఇండస్ట్రీ లాంగ్ రన్ పై కాకుండా, ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసుకున్నాక.. రికార్డ్స్ ట్రెండ్ కూడా మారింది. ఇప్పుడు రికార్డ్స్అన్నీ వసూళ్ల చుట్టే తిరుగుతున్నాయి. మొదటి రోజు ఇంత గ్రాస్, ఓవరాల్ షేర్ ఇంత, టోటల్ నెట్ ఇంత అంటూ వార్తలు మనం నిత్యం వింటూనే ఉన్నాము. మరి.. ఈ గ్రాస్ అంటే ఏంటి? షేర్ అంటే ఏంటి? నెట్ అంటే ఏంటి? వీటి మధ్య తేడా ఏమిటి? వీటిని ఎలా లెక్క కడతారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
గ్రాస్ :
సినిమా వసూళ్లను లెక్క కట్టడంలో మూడు దశలు ఉంటాయి. ఇందులో మొదటిది గ్రాస్. ఒక సినిమా సాధించే మొత్తం వసూళ్లను గ్రాస్ అంటారు. ఇక్కడ వచ్చిన వసూళ్లను వచ్చినట్టు కౌంట్ లో చూపిస్తారు. అంటే.. మెయింటనెన్స్ ఖర్చు తీయకుండా, కట్టాల్సిన ట్యాక్స్ తీయకుండా మొత్తం కలుపుకుంటే వచ్చే మొత్తాన్ని గ్రాస్ అంటారు.
నెట్ :
ఇక తరువాతది నెట్. ఒక సినిమా కలెక్షన్ నుండి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా.. కట్టగా మిగిలిన మొత్తాన్ని నెట్ అంటారు. ఈ ట్యాక్స్ ఎంత ఉంటుంది అనేది సినిమా ఆడే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. సినిమా టికెట్ పై ట్యాక్స్ పంచాయతీలో ఒకలా, మున్సిపాలిటీలలో ఒకలా, పట్టణాలలో ఒకలా, సిటీలలో ఒకలా ఉంటుంది. అలా.. గ్రాస్ లో నుండి ఈ ట్యాక్స్ పోగా, మిగిలిన మొత్తాన్ని నెట్ అంటారు.
షేర్ :
ఇక లాస్ట్.. షేర్. ఒక సినిమా ప్రదర్శన జరగాలంటే దానికి కొంత మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. ఉదాహరణకి ధియేటర్ రెంట్, పవర్ బిల్, ధియేటర్ లో మ్యాన్ పవర్ కాస్ట్ అంటూ చాలా తతంగం ఉంటుంది. గ్రాస్ లో ట్యాక్స్ కట్టగా మిగిలిన నెట్ నుండి.. ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా తీసేస్తే.. చివరికి మిగిలే అమౌంటే షేర్.
ఇప్పుడు ఓ ఉదాహరణతో ఇంకాస్త క్లియర్ గా వీటి గురించి తెలుసుకుందాం.
ఒక సినిమా టికెట్ ధర 100 రూపాయలు అనుకుందాం. ఆ షోకి మొత్తం 500 టికెట్స్ అమ్ముడుపోతే వచ్చే అమౌంట్ 50000. ఈ 50000 గ్రాస్ అవుతుంది. అందులో 30 శాతం ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో పోతుంది. అంటే.. ట్యాక్స్ పోగా మిగిలిన 35000 వేలు నెట్ అవుతుంది. చివరగా ఈ 35000 నుండి మెయింటెనెన్స్ ఛార్జ్ 7000 వేలు తీసేస్తే.. మిగిలే 28000 షేర్ అవుతుంది. ఇది.. గ్రాస్, నెట్, షేర్ లెక్కలు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.