తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో కార్తీకదీపం సీరియల్‌కున్న క్రేజే వేరు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనితలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అభిమానులున్నారు. ఒకానొక సమయంలో ఈ సీరియల్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయింది. అనేక ట్విస్ట్‌లతో.. ఏళ్ల పాటు సాగిన కార్తీకదీపం సీరియల్ అయిపోతుంది అనుకున్న తరుణంలో దర్శకుడు నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ చేసి.. సీరియల్‌కు ఆయువు పట్టు అయిన వంటలక్క, డాక్టర్ బాబులను చంపేసి.. మోనితను తొలగించి.. కథను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ సదరు డైరెక్టర్ ప్రయత్నం అడ్డంగా ఎదురు తిరిగింది. సీరియల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. దాంతో కార్తీకదీపం సీరియల్ దర్శకుడు దిదుబాటు చర్యలకు పూనుకున్నాడు.
ఫ్లాష్ బ్యాక్ పెట్టి.. చనిపోయినట్లు భావిస్తున్న దీప, కార్తీక్‌లను తిరిగి సీరియల్లో ప్రవేశపెట్టాడు. వారి పిల్లల క్యారెక్టర్లతో పాటు మోనితను కూడా తీసుకురానున్నాడు. ప్రస్తుతం ఈ సూపర్ ట్విస్ట్‌తో కార్తీక దీపం సీరియల్ మళ్లీ పుంజుకుంది. వంటలక్క రాకతో రేటింగ్ కూడా అమాంతం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. కార్తీకదీపం సీరియల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సీరియల్‌ను సినిమాగా ప్రసారం చేయబోతున్నారట… అది కూడా ఓటీటీలో. ఆ వివరాలు..
సుమారు ఐదేళ్ల క్రితం అనగా.. 2017, అక్టోబర్ 16 న కార్తీకదీపం సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ.. నేటితో 1434 ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకుంది. తాజాగా దాన్ని సినిమాగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇక గత ఐదేళ్లుగా స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కార్తీకదీపం సీరియల్ ప్రసారం అవుతుండగా.. ‘కార్తీకదీపం’ సినిమా మాత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాక కార్తీకదీపం సినిమాను మొదట థియేటర్స్‌లో విడుదల చేసి.. ఆ తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో వదలబోతున్నారట. అయితే ఐదేళ్ల ఎపిసోడ్లను కలిపి మూడు గంటల నిడివితో సినిమా చేస్తారా.. లేక ఇదే కథను తీసుకుని కొత్త క్యారెక్టర్లతోనో లేదంటే.. డాక్టర్ బాబు, వంటలక్కలతోనే సినిమా తీయబోతున్నారా వంటి తదితర విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ కూడా ఏ సీరియల్ సినిమాగా వచ్చింది లేదు. ఇప్పుడు కనక కార్తీకదీపం సీరియల్ సినిమాగా వస్తే.. సరికొత్త చరిత్రకు నాంది పలికినట్లే అంటున్నారు సినీ వర్గాల ప్రముఖులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.