ధనా ధన్ లీగ్ గా ఐపీఎల్ తరువాత అత్యంత ఆదరణ పొందిన మరో క్రికెట్ లీగ్ బిగ్ బాష్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న11 వ ఎడిషన్ బిగ్ బాష్ లీగ్ విన్నర్ గా పెర్త్ స్కార్చర్స్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ తో తలపడిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి 4 వ సారి బిగ్ బాష్ విన్నర్ గా అవతరించింది.
The Perth Scorchers crowned #BBL11 champions 🎆🏆 pic.twitter.com/Fs892Cyr7G
— Sky Sports Cricket (@SkyCricket) January 28, 2022
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదట బాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగు చేసింది. లారీ ఈవెన్స్ 76 పరుగులు, ఆస్టన్ టర్నర్ 54 పరుగులతో రాణించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టు 16.2 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు తీయగా, జై రీచర్డ్సన్ 2 వికెట్లతో రాణించారు. పెర్త్ స్కార్చర్స్ విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
You know the celebrations were wild when you end up with a bloodied nose#BBL11 pic.twitter.com/mUGMQfdaru
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2022
That winning feeling 🤩🏆 #BBL11 pic.twitter.com/FCu3wVSvrJ
— KFC Big Bash League (@BBL) January 28, 2022