ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు హెచ్చరికలు పంపుతున్నాడు. టెస్ట్, వన్డే, టీ20 అన్న తేడాలేకుండా వరుస సెంచరీలు బాదుతున్నాడు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శతకాల మోత మోగించిన అతడు, బిగ్ బాష్ లీగులోనూ లీగ్‌లో వరుస శతకాలతో చెలరేగి ఆడుతున్నాడు. ఇటీవల అడిలైడ్ స్ట్రయికర్స్పై శతకం మరవక ముందే వరుసగా రెండో శతకాన్ని నమోదుచేశాడు.
సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు స్మిత్. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో స్మిత్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా, అందులో రెండో సెంచరీలు బాదటం విశేషం. స్మిత్ ధాటికి సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ 62 పరుగులకే పరిమితమైంది. దీంతో సిడ్నీ సిక్సర్స్ 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక స్మిత్ గత మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 56 బంతుల్లోనే వంద మార్క్ అందుకున్నాడు. ఈ మ్యాచులో సిక్సర్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Another century by Steve Smith 💯 pic.twitter.com/CQZtlzr6Ss
— RVCJ Media (@RVCJ_FB) January 21, 2023
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి ఇండియా – ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. స్పిన్ ను ఎదుర్కోవడంలో స్మిత్ కు ఘనమైన రికార్డు లేనప్పటికీ.. నిలకడగా ఆడుతూ ఇబ్బందులు సృష్టించగలడు. అందులోనూ ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా అతనికి కలిసొస్తుంది. ఏదేమైనా.. బాల్ ట్యాపరింగ్ వివాదంతో కొన్నాళ్లు ఆటకు దూరమైన స్మిత్, తిరిగి అదే జోరు కొనసాగించడమంటే అతన్ని అభినందించాల్సిందే. స్టీవ్ స్మిత్ ఎంతటి విలువైన ఆటగాడో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2nd century 💯 on a row for Steve Smith. It’s been an eye treat to watch him play aggressive shots.!!!
His 125*(66) aids his team to clinch victory by a huge margin of 125 runs.! #SteveSmith#BBL12pic.twitter.com/3gFmAdYBkg
— CricketGully (@thecricketgully) January 21, 2023
💯 Century against Adelaide Strikers
💯 Century against Sydney ThunderSteve Smith is putting on a show in Big Bash League 12.#BBL12 pic.twitter.com/Q3W7FdGBCO
— CricTracker (@Cricketracker) January 21, 2023