“మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు”. ఈ మధ్యనే విడుదలైన నారప్ప ట్రైలర్ లోని డైలాగ్ ఇది. ఈ సినిమా తమిళ్ లోనే చాలా మంది చూసి ఉంటారు. ఓ గ్రామంలో ఉండే దళిత కుటుంబంపై.. భూస్వామి వర్గం కక్ష కడితే.. నారప్ప వారికి ఎలా ఎదురు తిరిగాడు అన్నది ఈ చిత్ర కథ. అయితే.., అచ్చం ఆ సినిమా కథే ఇప్పుడు నిజ జీవితంలో జరిగింది. అధికారుల కర్కశత్వానికి రాజస్థాన్ జలోరి జిల్లాలోని శాంఖోర్ ఏరియాలో నివాసం ఉండే నరసింగం అనే రైతు కుటుంబం, ఆ గ్రామ ప్రజలు అవమానం పాలై, దెబ్బలు తిని, చివరికి అధికారుల మీదకే తిరగబడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఎక్స్‌ప్రెస్ హైవే 754 నిర్మిస్తోంది. ఈ హైవే మధ్యలో ప్రతాప్పూర్ ఊరి నుంచి వెళ్తుంది. కానీ.., ఆ గ్రామంలోని రైతులకి ప్రభుత్వం నుండి సరైన నష్టపరిహారం అందలేదు. అక్కడ ఒక్కో ఎకరా రూ.10 లక్షలు ఉండగా అధికారులు రూ.45,000 మాత్రమే చెల్లించారు. దీంతో.., ఆ గ్రామంలోని రైతులు రోడ్డు పనులు జరగకుండా అడ్డుకున్నారు.
దీంతో.., అధికారులు పోలీసులతో కలసి రంగంలోకి దిగారు. రైతులకి పరిహారం ఇప్పించాల్సిన అధికారులు వారిపై రెచ్చిపోయారు. మీ బతుకులు ఎంత? మాకే ఎదురు చెప్తారా అంటూ దొరికిన వారిని దొరికినట్టు చావకొట్టారు. పోలీసులు అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ నిల్చున్నారు.
ఇక ఆ గ్రామంలో ఉండే నరసింగం అనే రైతు ఇదేంటి అని ప్రశ్నించినందుకు అతన్ని ఓ అధికారి గుండెలపై కాలితో తన్నాడు. తన 15 ఏళ్ళ మనవరాలిని జీప్ లో లాక్కుంటూ ఈడ్చుకెళ్లాడు. కొద్దిలో ఆ అమ్మాయికి ప్రాణాపాయం తప్పింది. ఈ మొత్తం వ్యవహారంతో గ్రామస్థులు ఒక్కసారిగా అధికారులపై తిరగబడ్డారు. అన్యాయంగా తమని కొట్టారు అంటూ అధికారులను తమ గ్రామం నుండి తరిమికొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
किसान को लात मारना वीरता का काम नहीं है एसडीएम साहब …
पर आपकी क्या गलती है , राजस्थान में कांग्रेस का राज है , अत्याचार करने की पुरी छूट है 👎@DrSatishPoonia @chshekharbjp pic.twitter.com/8aBiZKpquW
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) July 16, 2021