ఒలింపిక్స్‌ను అభిమానులు లేకుండానే నిర్వహించాలన్న జపాన్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సలహాదారు డాక్టర్ షిగెరె ఓమి సూచనను నిర్వాహకులు పట్టించుకోలేదు. స్థానిక అభిమానుల మధ్య గేమ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. జులై 23న టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉన్నాయి. ప్రతి ఒలింపిక్ వేదికలో 50 శాతం సామర్థ్యం లేదా గరిష్టంగా 10 వేల మంది అభిమానులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ మొదలవ్వకముందే రికార్డుల మోత మొదలయ్యింది. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్ రికార్డు సృష్టించారు. 2015లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తన రూల్స్‌ను మార్చింది. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళల కేటగిరీలో పోటీ చేయవచ్చు అని తెలిపింది. టెస్టెస్టరోన్ హార్మోన్లు తక్కువగా ఉన్నవారు ఆ క్యాటగిరీలో పోటీ చేసే వీలు ఉంటుంది. మహిళల 87 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో లారెల్ పోటీ చేయబోతున్నారు.
దీంతో 43 ఏళ్ల లారెల్ మొదటి సారి ట్రాన్స్‌జెండర్ కోటాలో ఒలింపిక్స్‌కు ఎంపికైన అథ్లెట్‌గా నిలిచారు. ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ గా ఘనత వహించారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో లారెన్ పాల్గొనే విషయమై న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. దీంతో క్రీడాలోకంతో పాటు పలువురు లారెన్‌ను ప్రశంసిస్తున్నారు.
ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడం వల్ల హబ్బర్డ్ మహిళల విభాగంలోనే బరిలోకి దిగనుంది. 2013 వరకు ఆమె పురుషుల కేటగిరీలో పోటీపడడటం విశేషం.