ఇటీవల ట్రాన్స్ జెండర్లు తమకు న చ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయా రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. ఒకప్పుడు సమాజంలో ఎన్నో ఛీత్కారాలకు గురైన వారు ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నారు. ట్రాన్స్ జెండర్లకు ఇప్పటికే అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచంలో ఇప్పుడు అన్ని రంగాల్లో ట్రాన్స్ జెండర్లు తమ సత్తా చాటుతున్నారు. తమకు నచ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయా రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారు. ఇటీవల ట్రాన్స్ జెండర్లు తాము ఇష్టపడిన వారితో వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ట్రాన్స్ జెండర్ తాను ఇష్టపడిన ప్రియుడిని పెళ్లాడింది. వివరాల్లోకి వెళితే…
థాయ్ లాండ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ట్రాన్స్ జెండర్ పొయిడ్ ట్రిచాడ తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 36 ఏళ్ల ట్రిచాడ హీరోయిన్ గానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ.. మోడల్ గా కూడా రాణిస్తుంది. తాజాగా పొయిడ్ ట్రిచాడ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పుకెట్ ప్రావిన్స్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఓక్ భవఘా హాంగ్యోక్ తో మార్చి 1 న వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఇప్పుడు మేం అఫిషియల్ గా భార్యాభర్తలం అంటూ ట్రిచాడ తన ఇన్ స్ట్రా అకౌంట్ లో పోటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ట్రిచాడ చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. థాయ్ లాండ్ లోని ఫెంగ్ నా లో 1986 లో జన్మించిన పోయిడ్ ట్రిచాడ మొదట బాలుడిగా ఉన్నప్పటికీ వయసు పెరుగుతున్నా కొద్ది తనలో అమ్మాయిల లక్షణాలు ఉన్నాయని గుర్తించి అప్పటి నుంచి తాను అమ్మాయి అని భావిస్తూ వచ్చింది. తన పదిహేడేళ్ల వయసులో ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించుకొని పూర్తిగా అమ్మాయిగా మారిపోయింది. అప్పటి నుంచి మోడలింగ్ రంగంలో తన కెరీర్ ఆరంభించి అంచెలంచెలుగా పైకి వచ్చింది. 2004 లో ట్రాన్స్ జెండర్స్ కోసం నిర్వహించిన మిస్ టిఫ్పనీ పోటీలో విజేతగా గెలిచింది.
2010 లో విత్ లవ్ మూవీతో ట్రిచాడ సినీ రంగంలోకి ప్రవేశించి వరుస విజయాలు అందుకుంది. ట్రిచాడ కు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఆమె ఇన్ స్టాలో 26 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. గత కొంత కాలంగా ఆమె వివాహం పై రక రకాల వార్తలు వచ్చాయి. వీటన్నింటికి పులిస్టాప్ పెడుతూ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.