ఈ మద్య పెళ్లి విషయంలో ఎక్కువ మంది యువత తమ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమకు నచ్చితే జెండర్ విషయం కూడా ఆలోచించడం లేదు. ఇటీవల కొంతమంది యువకులు ట్రాన్స్ జెండర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.
జీవితంలో ప్రతి ఒక్కరికీ వివాహం అనేది మరపురాని అనుభూతి. అందుకే చాలా మంది తమ పెళ్లి ప్రతిఒక్కరికీ గుర్తుండిపోయేలా చేసుకుంటారు. ఆడ-మగ కలిసి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం.. కానీ ఇప్పటి ఆధునిక కాలంలో అబ్బాయిని అబ్బాయి, అమ్మాయిని అమ్మాయి ఇష్టపడి చేసుకుంటున్నారు. కానీ ఈ మద్య కొంతమంది యువకులు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం వేములవాడలో జరిగింది.
పెళ్లి అనేది జీవితంలో ఓ మరుపురాని మధురమైన అనుభూతి. ఈ మద్య పెళ్లి వేడుకలు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాలా వరకు యువత తమకు నచ్చిన వాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. సొసైటీలో స్వతంత్రంగా జీవించేందుకు ఎవరికి నచ్చిన నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. వివాహం విషయంలో కూడా స్వతంత్ర భావాలతో ఆలోచిస్తూ.. జండర్ విషయం కూడా పట్టించుకోవడం లేదు. ఈ మద్య ఓ యువకుడికి ట్రైన్ లో పరిచయం అయిన ట్రాన్స్ జెండర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదే బాటలో మరో యువకుడు తాను ఇష్టపడ్డ ట్రాన్స్ జెండర్ పెళ్లి చేసుకున్నాడు.
వరంగల్ కి చెందిన హిజ్రా పింకి(22) తో హైదరాబాద్ కి చెందిన శ్రీనివాస్(23) కి కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. రోజూ ఫోన్ లో మాట్లాడుకుంటూ వీరిద్దరు ఒకరంటే ఒకరు అమితంగా ఇష్టపడ్డారు. కొంతకాలం తర్వాత ప్రేమలో పడ్డ పింకీ, శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో హిజ్రా పింకి, శ్రీనివాస్ లు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం రాజన్న సన్నిధిలో జూన్ 17 ఉదయం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. డిగ్రీ వరకు చదివిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.