ఒలింపిక్స్‌ను అభిమానులు లేకుండానే నిర్వహించాలన్న జపాన్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సలహాదారు డాక్టర్ షిగెరె ఓమి సూచనను నిర్వాహకులు పట్టించుకోలేదు. స్థానిక అభిమానుల మధ్య గేమ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. జులై 23న టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉన్నాయి. ప్రతి ఒలింపిక్ వేదికలో 50 శాతం సామర్థ్యం లేదా గరిష్టంగా 10 వేల మంది అభిమానులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ మొదలవ్వకముందే రికార్డుల మోత మొదలయ్యింది. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్ రికార్డు సృష్టించారు. […]
కరోనా కాలంలో మానవాళి ఇది వరకు ఎరుగని దారుణాలను చవి చూస్తోంది. అన్నీ వర్గాల ప్రజలు ఈ మహమ్మారి దెబ్బకి అల్లాడుతున్నారు. ఇక మన దేశంలో కొంతమంది దిగ్గజాలు ఈ చైనా వైరస్ దాటికి కుప్ప కూలుతుండటం అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి విషాదకర ఘటన మరొకటి చోటు చేసుకుంది. కరోనా వైరస్ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌ను బలి తీసుకుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఐదు రోజుల క్రితమే […]
సుశీల్ కుమార్. వరల్డ్ రెజ్లింగ్‌లో అతనో ఐకాన్. ఇండియా స్పోర్ట్స్ హిస్టరీలోని గొప్ప అథ్లెట్లలో ఒకడు. అయినా సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ పీకల్లోతు ఇరుక్కుపోవడానికి కారణం, సాగర్, అతడి ఇద్దరు మిత్రులపై సుశీల్ బృందం హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లుగా వెల్లడైన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దాడి ఘటనను వీడియో తీయగా సాగర్ చనిపోయిన రెండు రోజుల తర్వాత అతణ్ని అదుపులోకి తీసుకున్నపుడు తన మొబైల్ పరిశీలించగా అది బయటపడింది. […]