ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్వేఛ్చ పెరిగిపోయింది. ఐతే స్వేఛ్చతో పాటు విచ్చలవిడితనం కూడా బాగానే పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక అంశంపై ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఐతే ఎదుటువారిపై కామెంట్ చేసేటప్పుడు మాత్రం కొంత సంయమనం ఉండాలి. కాని కొన్ని సందర్బాల్లో మాత్రం సెలబ్రెటీలపై నెటిజన్స్ చేసే వ్యాఖ్యలు అంభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఇలాంటి కామెంట్స్ ను కొందరు ధీటుగా ఎదుర్కొంటే, మరి కొందరు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
ప్రముఖ మరాఠి నటి హేమాంగి కవిపై ఇలాంటి హేయమైన కామెంట్సే చేశాడో నెటిజన్. మరాఠీ, హిందీ సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో హేమంగికి మంచి పేరు ఉంది. సోషల్ మీడియాలో హేమంగి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఇంట్లో తాను స్వయంగా చెపాతీలు చేసే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది హేమంగి. ఐతే ఈ వీడియోపై నెటిజన్స్ దిగజారీ కామెంట్స్ చేశారు. ఆమె లోదుస్తులు ధరించలేదా.. మీరు చెపాతీలు చేస్తోంటే అవి కదులుతున్నాయని నీచంగా అడిగారు కొందరు.
ఐతే సదరు నెటిజన్స్ ను హేమాంగి ధీటుగా ఎదుర్కొంది. అవును, ఇంట్లో ఉన్న సమయంలో లోదుస్తులు ధరించాలా.. వద్దా అనేది నా ఇష్టం, అవును నాకు అవి ఉన్నాయి, అవి పురుషులకు ఉన్నట్లే ఉంటాయి, నా కాళ్లు, చేతులు కదిలినప్పుడు అవి కదులుతాయి, నేను పాలిచ్చే జాతికి చెందిన వ్యక్తిని.. అలాంటి జాతికి మగజాతి నమస్కరించాలి.. అంటూ హేమాంగి తన సమాధానాన్ని పోస్ట్ చేసింది.
హేమాంగికి ప్రముఖుల నుంచి మొదలు సామాన్యుల వరకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ ట్రోలింగ్ పై ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ టార్డే స్పందించారు. హేమాంగి ధైర్యాన్ని ఆయన అభినందించారు. హేమంగిపై చిల్లర కామెంట్ చేసిన నెటిజన్స్ పై అంతా మండిపడుతున్నారు.