బిచ్చగాడు, బిచ్చగాడు 2 మూవీస్ లో హీరో కోటీశ్వరుడు. అయితే రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా యాచక వృత్తిలో ఉన్నవారు బాగా సంపాదించినవారు ఉన్నారు.
కోలీవుడ్ హీరో విజయ్ ఆంథోనీ నటించిన బిచ్చగాడు మూవీ దాదాపు అందరూ చూసే ఉంటారు. ఈ మూవీలో కోట్లకు పడగెత్తిన హీరో తన తల్లి ఆరోగ్యం బాగుకావడానికి బిచ్చగాళ్లతో చేరి బిచ్చమెత్తుకుంటాడు. ఈ సినిమా సీక్వెల్ బిచ్చగాడు 2 లో కూడా యాచకుల కష్టాల గురించి చూపించాడు. సాధారణంగా సినిమాల్లో బిచ్చగాళ్లను కొన్నిసార్లు అత్యంత కోటీశ్వరులుగా చూపిస్తుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడైన బిచ్చగాడు మన భారత్ ఉన్నాడంటే నమ్ముతారా? నిజం భరత్ జైన్ అనే బిచ్చగాడు ప్రపంచంలోనే రిచెస్ట్ బిచ్చగాడు. వివరాల్లోకి వెళితే..
బిచ్చగాళ్లు అంటే చులకనగా చూడొద్దు.. వారిలోనూ కోటీశ్వరులు ఉంటారు అని కొంతమంది అంటుంటారు. యాచక వృత్తిలో ఉంటూ బాగా డబ్బు సంపాదించిన వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర థానేకు చెందిన ఓ బిచ్చగాడి గురించి సోషల్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. సదరు బిచ్చగాడి పేరు భరత్ జైన్. గత కొంతకాలంగా బిక్షాటన చేస్తూ వస్తున్న భరత్ జైన్ ప్రస్తుతం ఆస్తుల విలువ అక్షరాలా రూ.7.5 కోట్లు. అతడి నెల సంపాదన సామాన్యుడి నెలసరి జీతం కన్నా ఎక్కేవే. ప్రతిరోజూ భరత్ జైన్ బిక్షాటన చేసి రూ.2000 నుంచి రూ.2500 వరకు సంపాదిస్తాడట. మొత్తానికి భరత్ జైన్ ప్రతినెల బిక్షాటన ద్వారా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదిస్తాడట.
భరత్ జైన్ కి ముంబైలో రూ.1.2 కోట్ల విలువైన డబులు బెడ్ రూమ్, ఫ్లాట్లు ఉన్నాయి. అంతేకాదు థానేలో రెండు షాపులు కొనుగోలు చేశాడట.. వాటి ద్వారా ప్రతినెల రూ.30 కిరాయి వస్తుందట. అంతేకాదు భరత్ జైన్ కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి సైతం పెట్టాడట. భరత్ జైన్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాట. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భరత్ జైన్ ఎక్కువగా ఛత్రపతి శివాజా టెర్మినల్ లేదా ఆజాద్ మైదాన్ లో ఎక్కువగా భిక్షాటన చేస్తారట. భరత్ కుటుంబంలోని ఇతర కుటుంబ సభ్యులు స్టేషనరీ స్టోర్స్ నిర్వహిస్తుంటారు. తాను పడిన కష్టాలు తన పిల్లలు, భార్య పడకూడదరే సంపాదించిన సొమ్ము జాగ్రత్త చేశాడట. ప్రస్తుతం భరత్ ఆస్తుల విలువ ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం భారత్లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత రిచ్చెస్ట్ బిచ్చగాడు అని వార్తలు వస్తున్నాయి.