కర్నాటక రాష్ట్రంలో అతి ప్రధానమైన ప్రాంతాల్లో హుబ్బళ్లి ఒకటి. ఉత్తర కర్నాటక ప్రాంతంలో వాణిజ్య కార్యకలపాలకు ఈ పట్టణం ప్రధాన కేంద్రం. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ నగరం.. తాజాగా వరల్డ్ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది.
కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉత్తర కర్నాటక ప్రాంతంలో అతిముఖ్యమైన నగరాల్లో హుబ్లీ ఒకటి. హుబ్లీ కాస్తా కాలక్రమంలో హుబ్బళ్లిగా మారింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న హుబ్బళ్లి పట్టణం తాజాగా అరుదైన ఘనత సాధించింది. కన్నడ ప్రాంతంలో ఉన్న హుబ్బళ్లి రైల్వే స్టేషన్ ప్రత్యేక గుర్తింపునకు సంపాదించింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫామ్ హుబ్బళ్లి లో ఏర్పాటైంది. శ్రీ సిద్ధరూద స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ కు గిన్నిస్ బుక్ చోటు లభించింది. 1,507 మీటర్ల పొడవైన ఈ రైల్వే ప్లాట్ ఫామ్ ను దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించారు.
ఓ రైల్వే ప్లాట్ ఫామ్ 1.5 కిలోమీటర్ల దూరం ఉండటం అనేది మాములు విషయం కాదు. ఈ రైల్వే ప్లాట్ ఫామ్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 5 ప్లాట్‌ఫామ్‌లతో పాటు పెరుగుతున్న నగర అవసరాలను తీర్చడానికి, మూడు కొత్త ప్లాట్‌ఫామ్‌లను నిర్మించారు. అందులో ఒకటి అయినా 8వ నంబర్ ఫ్లాట్ పామ్ ను 1507మీటర్ల పొడవున నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందింది. ఈ పొడవైన ప్లాట్‌ఫామ్ నుంచి ఒకే సమయంలో రెండు రైళ్లను ఎలక్ట్రిక్ ఇంజన్‌లతో ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు.
ఈ కొత్త నిర్మాణం హుబ్బళ్లి, ధార్వాడ్ ప్రాంతాల్లో భవిష్యత్తు రవాణా అవసరాలను తీరుస్తుంది. అంతేకాక ఈ ఫ్లాట్ పామ్ నుంచి ఒకేసారి రెండు దిశల్లో రైళ్లను ప్రారంభించవచ్చు. కేంద్ర ప్రభుత్వం కర్నాటకలోని పలు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే హుబ్బళ్లి యార్డ్ ను నవీకరణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రైల్వే ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేశారు. కర్నాటకలో శ్రీసిద్ధరూద స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్ కీలకమైన జంక్షన్. వాణిజ్య కార్యకలాపాలకు ఇది కీలక కేంద్రంగా పని చేస్తుంది.
ఉత్తర కర్నాటక ప్రాంతంలో వ్యాపార కార్యకలపాలకు హుబ్బలి ప్రధాన కేంద్రం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ పలు ప్రాంతాలను కలిపి ప్రధాన రైల్వే జంక్షన్ గా గుర్తింపు ఉంది. ఉత్తర భారతదేశం నుంచి బెంగళూరు వైపు , అలానే హోసపేట వైపు, వాస్కోడిగామా వైపు వెళ్లే రైళ్లకు హుబ్బలి ప్రధాన జంక్షన్ గా ఉంది. ఈ జంక్షన్ మీదుగానే వివిధ ప్రాంతాలకు రైళ్ల వెళ్తున్నాయి. మరి.. ఈ అరుదైన గుర్తింపు భారతదేశానికి అందులోనూ దక్షిణ భారత దేశ ప్రాంతమైన హుబ్బళ్లకి దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.