electric vehicles : మొన్న తమిళనాడులో ఎలక్ట్రిక్ స్కూటీ తగలబడి తండ్రీ, కూతుళ్లు మరణించిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచ్చిలో ఎలక్ట్రిక్ స్కూటీ తగలబడిపోయింది. నాలుగు రోజుల వ్యవధిలో ఇలా ఎలక్ట్రిక్ స్కూటీలు తగలబడటం ఇది నాలుగో సారి. లోపం ఎక్కడుందో తెలియదు. కానీ, నిండు ప్రాణాలైతే ప్రమాదంలో పడుతున్నాయి. కొన్న వారినే కాదు.. ఇకపై కొనాలనుకునేవారిని కూడా ఆలోచనల్లో పడేస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? కారణాలేంటి?.. ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?….
ప్రమాదాలకు ప్రధాన కారణం ఏంటి?..
చాలా కేసుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడటానికి ప్రధాన కారణం బ్యాటరీలే. బ్యాటరీ తయారీలో నాణ్యతా లోపం ఉన్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇండియాలోని చాలా కంపెనీలు లిథియం అయాన్ బ్యాటరీలనే వాడుతున్నాయి. అయితే, ఇండియా ఈ బ్యాటరీలో ప్రధాన కాంపోనెంట్ అయిన లిథియం అయాన్ సెల్ కీలను తయారు చేయదు. సౌత్ కొరియా, థైవాన్, చైనా, జపాన్ వంటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంది.
ఈవీ బ్యాటరీలే తగలబడ్డానికి కారణం ఏంటి?..
ఈవీ బ్యాటరీలు తగబడటానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి పైన చెప్పినట్లుగా బ్యాటరీ తయారీలో లోపం. రెండవది బ్యాటరీ ఫేయిల్యూర్. సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ మొదలుకుని లాప్‌ట్యాప్స్, పవర్ బ్యాంక్స్, ట్యాబ్లెట్స్ వంటి వాటిలో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నాయి కంపెనీలు. అయితే, ఈవీలో వాడే బ్యాటరీలు మిగిలిన వాటికంటే ప్రత్యేకమైనవి. ఈవీలోని బ్యాటరీలు ల్యాప్‌ట్యాప్స్ కంటే మూడు రెట్ల శక్తిని స్టోర్ చేసుకుంటాయి. ఛార్జింగ్ సమయంలో పవర్‌లో హెచ్చు,తగ్గులు, ఎండ, వాన, దుమ్ము, వైబ్రేషన్ ఇలా అన్ని విషయాలు బ్యాటరీ పని తీరుపై ప్రభావం చూపుతాయి. తద్వారా బ్యాటరీ తగలబడే ఛాన్స్ ఉంది.
ఈవీ బ్యాటరీ ప్రమాదంలో ఉందని ఎలా గుర్తించాలి?..
ఈవీ బ్యాటరీ ప్రమాదంలో ఉందని తెలుసుకోవటానికి చాలా రకాల సంకేతాలు ఉన్నాయి. ఒక వేళ లిథియం అయాన్ బ్యాటరీలు ప్రమాదంలో ఉన్నట్లయితే.. అది ఎక్కువగా హీట్ అవుతుంది, ఉబ్బిపోయి ఉంటుంది. అంతేకాదు! బ్యాటరీ రంగు కూడా మారుతుంది. పాడైనట్లుగా కనిపిస్తుంటుంది. కొన్నికొన్ని సార్లు బ్యాటరీలోంచి పొగకూడా వస్తుంటుంది. ఈ సంకేతాలను గుర్తించి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈవీలు ప్రమాదంలో పడుకుండా ఉండాలంటే ఏం చేయాలి?..
ఈవీలు ప్రమాదంలో పడే సందర్భాలు చాలా తక్కువ. అయినప్పటికి ముందు జాగ్రత్తతో వ్యవహరించటం చాలా మంచిది. ఈవీలు ప్రమాదంలో పడకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలు పాటించండి. ఇలా చేస్తే మీ ఈవీ బ్యాటరీలు తగలబడే అవకాశాలను తగ్గించవచ్చు. ఈవీలను వాడిన వెంటనే వాటికి ఛార్జింగ్ పెట్టడం మానండి. మీరు స్కూటీని ఆపు చేసినప్పటికి ఆ సమయంలో లిథియం అయాన్ సెల్స్ వేడిగానే ఉంటాయి. అందుకని, బ్యాటరీ కూల్ అయేంతవరకు ఆగి ఛార్జింగ్ పెట్టండి. ఒక వేళ బ్యాటరీని పక్కకు తీసే అవకాశం ఉంటే పక్కకు తీసి ఛార్జింగ్ పెట్టండి. కంపెనీ ఇచ్చిన బ్యాటరీని మాత్రమే వాడండి. వాటి స్థానంలో వేరే వాటిని వాడటం.. ముఖ్యంగా తక్కువ రేటుకు వచ్చే వాటిని వాడటం ప్రమాదం. ఇది బండిని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అందుకని, కంపెనీ ప్రాడెక్ట్స్‌ను మాత్రమే వాడండి. బ్యాటరీలకు నేరుగా ఎండ పడేలా ఉంచకండి. బ్యాటరీలను ఎల్లప్పుడు పొడి వాతావరణంలో ఉంచండి.
ఇవి కూడా చదవండి : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వ్యాఖ్యలు: కేజ్రివాల్ నివాసంపై దాడి..