Government Hospital: సాధారణంగా ఆసుపత్రులు రోగులకు షాక్ ఇస్తూ ఉంటాయి. లక్షల, లక్షల బిల్లులు ఇచ్చి రోగం నయం అయిందన్న సంతోషాన్ని పోగొడుతూ ఉంటాయి. కరోనా సమయంలో అయితే ఇంగ్లాండ్, అమెరికాలాంటి దేశాల్లో ఏకంగా కొంతమంది రోగులకు కోట్లలో బిల్లులు వచ్చాయి. వాళ్లకు కోట్ల రూపాయల హెల్త్ పాలసీలు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. కానీ, ఇండియా లాంటి దేశాల్లో లక్ష వచ్చినా కష్టమే. కోటి వస్తే ఆ రోగి ఆసుపత్రిలోనే ఉరి వేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఆసుపత్రులు జనాలకు షాకులు ఇచ్చిన ఘటనలు చాలా జరిగాయి. కానీ, పశ్చిమ బెంగాల్‌లో ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది.
ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఏకంగా వైద్య శాఖకు షాక్ ఇచ్చింది. ఆసుపత్రి అధికారులు కాంట్రాక్టర్ సహాయంతో ఆసుపత్రి నెల ఖర్చులు కోటి రూపాయలంటూ నకిలీ బిల్లులు సృష్టించారు. కాంట్రాక్టర్ ఇచ్చిన నకిలీ బిల్లులను పాస్ చేసి సొమ్మ కూడా చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్, ఈస్ట్ బుర్‌ద్వాన్ జిల్లాలో కత్వా సబ్ డివిజినల్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రి నెల అవసరాలు తీర్చడానికి ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రతి నెలా ఆసుపత్రి మొత్తం అవసరాలను అతడు తీర్చి.. ఆ నెలకు సంబంధించిన ఖర్చును బిల్లు రూపంలో ఆసుపత్రి అధికారులకు పంపి డబ్బులు పొందొచ్చు. ప్రతీ నెల లాగే పోయిన నెల కూడా ఆసుపత్రి అధికారులకు కాంట్రాక్టర్ నుంచి బిల్ వచ్చింది.అది కూడా కోటి రూపాయలకు. ఆసుపత్రి సిబ్బంది బిర్యానీ తినటానికి 3 లక్షలు ఖర్చు చేశారని అందులో ఉంది. అంతేకాదు! బిర్యానీ ప్లేట్లకు 80 వేల రూపాయలు ఖర్చు అయినట్లు ఉంది. ఈ బిల్లులన్నింటిపై ఆసుపత్రి అధికారులు సంతకం చేసి, బిల్లు పాస్ చేశారు. అయితే, ఈ విషయం వైద్యశాఖ దృష్టికి వెళ్లింది. కోటి రూపాయల బిల్లులు చూసి వైద్య శాఖ అధికారులు షాక్ అయ్యారు. నకిలీ బిల్లులు పెట్టి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. తప్పుడు బిల్లులు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karnataka: దారుణం.. మహిళా న్యాయవాదిని కడుపులో తన్నుతూ దాడి.. వీడియో వైరల్