వేసవికాలంలో కూడా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా దీనికి తోడు పిడుగుపాటు కారణంగా ప్రాణాలు విడుస్తోన్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇక తాజాగా పిడుగుపాటు కారణంగా 14 మంది మృతి చెందారు. ఆ వివరాలు..
ప్రకృతి.. వికృతి అయితే ప్రళయమే.. మరి ఆ పరిస్థితులు కల్పిస్తుంది ఎవరంటే.. స్వయంగా మనిషే. ఈ భూమ్మీద విచక్షణ కలిగిన జీవిగా పేరు తెచ్చుకున్న మనిషి.. అత్యాశతో తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నాడు. ఆ ఫలితాలే నేడు పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు. వానా కాలంలో కురవాల్సిన వర్షాలు.. సీజన్‌లు దాటి మరి కురుస్తున్నాయి. ఇక వేసవిలో భానుడి ప్రతాపం చూస్తే.. ఈ భూగోళం కొలిమిలా మండుతుందా ఏంటి అనిపించకమానదు. ఇక వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక తాజాగా విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పిడిగుపాటు కారణంగా ఏకంగా 14 మంది మృతి చెందారు. ఆ విషాదకర సంఘటన వివరాలు..
ఈ దారుణం పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఏకంగా 14 మంది మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. గురువారం నాడు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో పలు చోట్ల పిడుగుల కారణంగా 14 మంది మృతి చెందారు. వీరిలో పుర్బ బర్దమాన్ జిల్లాలోనే పిడుగుపాటుకు గురై నలుగురు మృతి చెందగా.. ముర్షిదాబాద్ జిల్లాలో ఇద్దరు, నార్త్ 24 పర్గానాస్ జిల్లాల్లో మరో ఇద్దరు.. పిడుగు పాటు కారణంగా ప్రాణాలు విడిచినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. అలానే పశ్చిమ్ మిడ్నాపూర్ జిల్లాలో ముగ్గురు, హౌరా రూరల్ జిల్లాలో మరో ముగ్గురు పిడుగులు పడి చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇక పిడుగుపాటు కారణంగా చనిపోయిన వారిలో రైతులే ఎక్కువ మంది ఉండటం విషాదకరం. వీళ్లందరూ తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా పిడుగు పడటంతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గురువారం సాయంత్రం మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినట్లు అధికారులు వివరించారు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయంది.