ఈ మద్య పెళ్లివేడుకలో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వధూవరులు ఎంట్రీ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వధువును వరుడు ఆట పట్టించడం.. మరికొన్ని చోట్ల ఇద్దరి మద్య గొడవలు రావడం.. కొట్టుకున్న వీడియోలు కూడా ఉన్నాయి. కొన్ని వీడియోల్లో మాజీ ప్రియుడు, ప్రియురాలు ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేయడం లాంటి సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి కూతురు పెళ్లి కుమారుడితో హోమం చుట్టు రెండు రౌండ్లు తిరిగాక.. చివర్లో షాక్ ఇచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ జరిగింది. వివరాల్లోకి వెళితే..
యూపీలో నీతా యాదవ్, రవి ల పెళ్లి సందడి మొదలైంది. వధూ వరుడికి సంబంధించిన బంధువులు అంతా సంతోషంలో మునిగిపోయారు. వరమాల కార్యక్రమం కూడా అయిపోయింది. పెళ్లికూతురు.. పెళ్లికొడుకు హూమం చుట్టు తిరిగే కార్యక్రమం మొదలైంది. వరుడి చేయి పట్టుకొని వధువు రెండు రౌండ్లు తిరిగిన తర్వాత తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని మండపం దిగిపోయింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే షాక్ తిన్నారు. ఏం జరిగిందని ప్రశ్నించారు.
పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడని.. పెళ్లి సంబంధం చూసే సమయంలో వేరే ఫోటో చూపించి మోసం చేశారని.. ఇప్పుడు పెళ్లి కొడుకు వేరేలా ఉన్నాడని ఆరోపించింది. దీంతో వరుడికి దిమ్మతిరిగింది. పెళ్లి కూతురుకి ఇరు కుటుంబ సభ్యులు ఎంతగానో నచ్చజెప్పారు. కానీ పెళ్లి కూతురు మాత్రం ససేమిరా అంది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nalgonda: ఆషాఢమని పుట్టింటికి వచ్చి.. నవవధువు!