ఈ ఏడాది సివిల్స్ ఫలితాల్లో కాస్త గందరగోళం ఏర్పడింది. ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్ వచ్చింది. ఇదేలా సాధ్య అయ్యింది.. అసలేం జరిగింది అంటే..
సివిల్ సర్వీసెస్ పరీక్షలు దేశంలో అత్యంత ప్రతిష్టాకత్మమైనవిగా భావిస్తారు. ఈ పరీక్షల్లో విజయం సాధించాలని లక్షల మంది ఏళ్ల పాటు ఎంతో కఠినంగా శ్రమిస్తారు. అయితే వారిలో కేవలం కొన్ని వందల మంది మాత్రమే ఈ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ ఏడాది సివిల్స్ ఫలితాలు రెండు రోజుల క్రితం విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిప పలువురు అభ్యర్థులు ఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సివిల్స్ ఫలితాలు కాస్త గందరగోళాన్ని క్రియేట్ చేశాయి. ఈసారి పరీక్షల్లో.. ఇద్దరు అభ్యర్థులకు సేమ్ ర్యాంక్ రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. మరి ఇదేలా జరిగిందో విచారించే పనిలో ఉన్నారు అధికారులు.
సివిల్స్ పరీక్ష అంటే అప్లికేషన్‌లు ప్రారంభం నుంచి ఇంటర్వ్యూ, చివరి ఫలితాల ప్రకటన వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అధికారులు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా.. యూపీఎస్సీ బోర్డు ప్రతిష్టకే మచ్చ. అందుకే ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఇక సాధారణ పోటీ పరీక్షల్లో ఇద్దరు అభ్యర్థులకు ఒకే ర్యాంక్ రావడం కామన్. కానీ సివిల్స్ మాత్రం అలా జరిగే అవకాశం లేదంటున్నారు నిపుణులు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఈ ఏడాది ఇద్దరు అమ్మాయిలకు సేమ్ ర్యాంక్ వచ్చింది. 184 ర్యాంక్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు వచ్చింది. మరి ఎలా జరిగింది అంటే..
ఈ ఏడాది సివిల్స్ ఫలితాలు మే 23, మంగళవారం సాయంత్రం విడుదల సంగతి తెలిసిందే. ఈ రిజల్ట్‌లో మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రాని 184వ ర్యాంక్ సాధించింది అని ఉంది. దాంతో ఆమె.. కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇదే రిజల్ట్ చూసి మరో యువతి కూడా సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. ఆమె మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని అయాషా ఫాతిమా. అదేంటి పేర్లు వేరు ఉన్నాయి కదా.. వారికి తెలియలేదా అంటే లేదు. అందుకు కారణం ఆమె హాల్ టికెట్ నంబర్ కూడా సేమ్. అంటే ఇద్దరు యువతులకు కలిపి ఒకే హాల్ టికెట్ నంబర్ కేటాయించింది యూపీఎస్సీ బోర్డ్.
అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రానీ (23) తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్ సాధించిందని ఆమె తండ్రి సలీముద్దీన్ తెలిపారు. అయాషా మ్యాథమెటిక్స్ విభాగంలో సివిల్స్ రాసి ఉత్తీర్ణత సాధించిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుంది. మరోవైపు దేవాస్‌కు చెందిన నజీరుద్దీన్ కుమార్తె అయాషా ఫాతిమా (26) తాను నాలుగో అటెంప్ట్‌లో సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించానని చెబుతోంది. ఆమె పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌తో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసిందని నజీరుద్దీన్ తెలిపారు. మరి వీరిద్దరిలో అసలు ఎవరు సివిల్స్‌లో ర్యాంక్ సాధించారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
పైగా ఇద్దరు అభ్యర్థులు తమకే ర్యాంక్ వచ్చింది అంటే తమకే వచ్చిందని వాదిస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించి అసలు అభ్యర్థికి మేలు చేయాలని సూచిస్తున్నారు ఇరువురు కుటుంబ సభ్యులు. అయితే ఈ అంశంపై నిపుణులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. యూపీఎస్సీ బోర్డు.. ఇద్దరు అభ్యర్థులకు ఒకే నంబర్ కేటాయించే చాన్స్ లేదని.. అలాంటి తప్పు చేయదని అంటున్నారు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే రోల్ నంబర్‌ను కేటాయించడం అసాధ్యం అని అంటున్నారు. వాటిలో ఒకటి నకిలీది అని అది ఎవరిదో తేల్చాలి అని సూచిస్తున్నారు.
ఇరువురి అడ్మిట్ కార్డులను లోతుగా పరిశీలించగా.. అయాషా మక్రానీ అడ్మిట్ కార్డ్‌లో పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25 అని, ఆ రోజు గురువారం అని రాసి ఉంది. ఇక అయాషా ఫాతిమా అడ్మిట్ కార్డులోనూ పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25గా పేర్కొనగా.. ఆ రోజు మంగళవారం అని ఉంది. క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 25 మంగళవారం. ఇదే కాక దేవాస్‌కు చెందిన అయాషా అడ్మిట్ కార్డ్‌పై క్యూఆర్ కోడ్‌తో యూపీఎస్సీ వాటర్ మార్క్ ఉంది. అయితే, అలీరాజ్‌పూర్‌కు చెందిన అయాషా అడ్మిట్ కార్డ్‌పై ఎలాంటి క్యూఆర్ కోడ్ లేకుండా సాదా కాగితంపై ప్రింట్‌అవుట్‌ను పోలి ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు నకిలీనే తేల్చాల్సింది యూపీఎస్సీ బోర్డు మెంబర్స్, పోలీసులు.