కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులను మార్చడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. అలానే అప్పుడప్పుడు రాష్ట్రాల్లో ఏర్పడే పరిస్థితుల కారణంగా మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో కొందరు మంత్రి పదవి కోల్పోగా.. వారి స్థానంలో కొత్త వారు మంత్రులుగా ప్రమోట్ అవుతుంటారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులను మార్చడం అనేది సర్వసాధారణం. అప్పుడప్పుడు రాష్ట్రాల్లో ఏర్పడే పరిస్థితుల కారణంగా మంత్రివర్గంలో మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులో కొందరు మంత్రి పదవి కోల్పోతుంటారు. అలానే వారి స్థానంలో కొత్త వారు మంత్రులుగా ప్రమోట్ అవుతుంటారు. తాజాగా ఢిల్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు ఎమ్మెల్యేలను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో రెండు మార్పులు జరగనున్నాయి. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టైన సంగతి తెలిసిందే. అలానే మనీలాండరింగ్ కేసులో మరో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టయ్యారు. ఈ ఇద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి స్థానాల్లో ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషికి మంత్రులు గా ప్రమోషన్ వచ్చింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను తన కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపించారు. ఆయన ఆమోదం తర్వాత ఈ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుంది.
గత కొన్ని నెలలుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇటీవలే మద్యం కుంభకోణం కేసులో భాగంగా మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందంటూ 2022మేలో సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ ఇద్దరి మంత్రుల దగ్గర 20 పోర్ట్ ఫోలియోలు ఉన్నాయి. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, విద్యశాఖ మంత్రితో పాటు అనేక ఉన్నత స్థాయి శాఖలను చూస్తున్నారు.
ఇక సత్యేందర్ జైన్ ఢిల్లీ హెల్త్, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. సిసోడియా దగ్గర ఉన్న విద్య, ఆర్థిక శాఖలతో పాటు మరికొన్ని పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గెహ్లోత్, రాజ్ కుమార్ ఆనంద్ లకు కేజ్రీవాల్ కేటాయించనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరగాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి.. కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.