తమిళనాడులో నర్స్ దారుణహత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులుకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. దారుణానికి కారణం వివాహేతర సంబంధమేనని తేల్చారు పోలీసులు. నర్స్ ఇంట్లో 500 కండోమ్‌లు వెలుగు చూడటం గమనార్హం. ఆ వివరాలు..
తమిళనాడు తేని జిల్లాకు చెందిన సెల్వి(43) భర్త సురేష్‌తో కలిసి అందిపట్టి ప్రాంతంలో నివసిస్తోంది. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సెల్వి గత కొన్ని సంవత్సరాలుగా నర్స్‌గా పని చేస్తోంది. అయితే దంపతుల మధ్య విబేధాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. కొంత కాలం నుంచి సురేష్ ఒంటిరగా దిండిగల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.
సెల్వి అందిపట్టు ప్రాంతంలోనే ఒంటిరిగా నివసిస్తుంది. ఈ క్రమంలో ఆమె పలువురు మగాళ్లతో పరిచయం పెంచుకుని.. వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇలా ఉండగా ఊహించని విధంగా సెల్వి దారుణ హత్యకు గురయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో పోలీసులకు విస్తుపోయే అంశాలు తెలిసాయి. భర్తతో విడిపోయిన తర్వాత సెల్వి దాదాపు 150 మంది మగాళ్లతో వివాహేతర సంబంధం కొనసాగిందిచంది. ఇక ఆమె మొబైల్ 300 మంది మగాళ్ల నంబర్లు ఉన్నాయి. ఇక సెల్వి ఇంట్లో 500కు పైగా కండోమ్‌లో లభించడంతో పోలీసులు విస్తుపోయారు.
ఈ క్రమంలో కంబం ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న రామచంద్రబాబు అనే వ్యక్తి మీద పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే సెల్విని హత్య చేసినట్లు తెలిపాడు. పదేళ్ల క్రితం తాను, సెల్వి పెరియకులం ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేశారు. ఆ సమయంలో రామచంద్రబాబు తన భార్య నగలు తాకట్టు పెట్టి మరి సెల్వికి కొంత డబ్బు ఇచ్చాడు.
తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటు రామచంద్రబాబు పలుమార్లు సెల్విని అడిగాడు. ఆమె దాటవేస్తూ వచ్చింది. ఈ క్రమంలో సెల్వి ఇంటికి వచ్చిన రామచంద్రబాబు మరోసారి తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి అడిగాడు. ఈ కక్రమంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన రామచంద్రబాబు సెల్విపై దాడి చేయడంతో ఆమె మరణించింది.
రక్తపు మడుగులో పోలీసులకు లభించిన ఫూట్ ప్రింట్స్, రామచంద్ర ఫూట్ ప్రింట్స్‌తో సరిపోలాయి. అతడిని అరెస్ట్ చేసేలోపే రామచంద్ర ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతడికి కూడా పలువురు మహిళలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.