ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగాపెరిగి పోయింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాను వినియోగించుకుని చాలా మంది ఫేమస్ అయ్యారు. ఇక ఇన్ స్టాగ్రాంలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు యువత ఎంతటి సాహసాలు చేయడానికి కూడ వెనకాడటం లేదు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగి పోయింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాను వినియోగించుకుని చాలా మంది ఫేమస్ అయ్యారు. మరెందరో వీడియోలు చూస్తే గుర్తింపు పొందెందు ప్రయత్నలు చేస్తున్నారు. ఇక ఇన్ స్టాగ్రాంలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు యువత ఎంతటి సాహసాలు చేయడానికి కూడ వెనకాడటం లేదు. కొందరు కొండలపైకి ఎక్కి వీడియోలు తీయడం, రైల్వే ట్రాక్స్ వద్ద ప్రమాదకర రీతుల్లో వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ యువతి కూడా రీల్స్ కూడా అతి యాక్షన్ చేసింది. ఏకంగా ప్రధాన రహదారిపై రన్నింగ్ కారు బానెట్ పై కూర్చొని ఇన్ స్టా రీల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ రాజ్ జిల్లాలలోని సివిల్ లైన్ ప్రాంతంలో వర్ణిక అనే యువతి ఉంటుంది. ఆమెకు రీల్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే సరదా. అంతేకాక వెరైటీగా వీడియోలు చేసేందుకు వర్ణిక ఆసక్తి చూపిస్తుండేది. ఈక్రమంలోనే తాజాగా వర్ణిక.. సఫారీ లగ్జరీ కారు బానెట్‌పై కూర్చొని మరీ ఓ ఫేమస్ సాంగ్ కు రీల్ చేసింది. పెళ్లి కూతురు వేషధారణలో పోజులిచ్చింది. ఇక రోడ్డుపై షూట్ చేసిన ఈ రీల్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అది వైరల్‌గా మారి.. చివరకు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు సదరు యువతికి షాకిచ్చారు. వీడియోలో కనిపించిన కారు నంబరు ప్లేటు ఆధారంగా యువతి వివరాలను పోలీసులు సేకరించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఆమెకు రూ.15,500 జరిమానా విధించి హెచ్చరించారు. చూశారా..ఇలా రీల్స్ కోసం అతి ప్రయోగాలు చేసి.. కొందరు యువత ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు జైలు పాలు అవుతున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.