భూమి మీద నిత్యం ఎక్కడో ఒకచోటు ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి. మరీ ముఖ్యంగా భూకంపం, వరదలు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువుగా సంభవిస్తుంటాయి. ఇక భూకంపాల కారణంగా జరిగే ప్రాణ, ఆస్తి నష్టం ఎలా ఉంటుందో ఇప్పటికే మనం అనేకం చూశాం. అకస్మాత్తుగా సంభవించే భూకంపాల కారణంగా చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ ఘటనలో ఆరు మంది మరణించారు. నేపాల్ లో ఏర్పడిన భూకంప ప్రభావం భారత్ లోని ఉత్తరాది రాష్ట్రాలపై పడింది.
బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 6.3 చూపించింది. దీని ప్రభావంతో భారత్ లోని ఉత్తరాఖండ్, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోని ఘజియాబాద్, గురుగ్రామ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్‌లో భూ ప్రకంపనలు కనిపించాయి. దీంతో నిద్రలో ఉన్న ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బుధవారం ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ ప్రాంతంలో రెండు సార్లు భూమి కంపించింది. బుధవారం ఉదయం 6.27 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు ఏర్పడ్డాయని తెలిపింది. కాగా, గత పదేళ్ల కాలంలో ఉత్తరాఖండ్‌లో ఏడు వందల సార్లు భూకంపాలు సంభవించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే వీటిల్లో చాలా వరకు బయటకు కనిపించలేదని వారు తెలిపారు.
pov there was a massive earthquake and they didn’t let the girls out of the hostels so all the boys are screaming in disappointment 💔#earthquake #delhi pic.twitter.com/7IjNagppAT
— vipin in a sunlit room🧣 (@coneyisland4eva) November 8, 2022