పిల్లలకు ఆటవస్తువులు, బొమ్మలు అంటే చాలా ఇష్టం. అవి ఉంటే వాళ్లు ప్రపంచాన్నే మరచిపోయి కాలం గడిపేస్తుంటారు. పిల్లలకి వాటితో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పడుతుంది. తాము ఆడుకునే బొమ్మలు కనిపించకపోతే భూగోళం దద్దరిల్లేలా పిల్లలు ఏడుస్తుంటారు. బొమ్మను తిరిగి ఆ పిల్లల వద్దకు చేరిస్తే చెప్పలేని సంతోషంతో ఎగిరి గంతేస్తారు. పిల్లల మనస్సు తెలుసుకున్న వాళ్లు పెద్ద పెద్ద సాహసాలు సైతం చేస్తుంటారు. కేవలం వారిపై ప్రేమ ఉంటే.. ఎంతటి సాహసం చేయడానికైనా కొందరు సిద్ధ పడుతుంటారు. అచ్చం అలానే రైల్వే పోలీసులు చిన్నారి మరచిపోయిన బొమ్మను ఆమె వద్ద చేర్చడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. చివరకు బొమ్మను ఆ చిన్నారికి అందివ్వడంతో ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
అద్నాన్ అనే 19 నెలల చిన్నారి కుటుంబం కిషన్ గంజ్ వెళ్లేందుకు సికింద్రాబాద్ లో అగర్తలా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. రైలు బయలుదేరినప్పటి నుంచి ఆద్నాన్.. తన దగ్గర ఉన్న ఓ బొమ్మతో తెగ ఆడుకుంటూ ఉన్నాడు. ఎవరైన సరదాగా ఆ బొమ్మను తీసినా, కొద్ది సమయం దాచి పెట్టిన పెద్ద ఎత్తున ఏడ్చేవాడు. ఇదంతా అదే కోచ్ లో ఉన్న ఇండియన్ ఆర్మీ హవల్దార్ విభూతి భూషణ్ గమనిస్తూ వచ్చారు. బీహర్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ స్టేషన్ రాగానే అద్నాన్ కుటుంబ రైలు దిగిపోయింది. రైలు కూడా స్టేషన్ నుంచి బయలుదేరింది. ఇదే సమయంలో ఆ చిన్నారి బొమ్మను మరిచిపోవడం ఆ హవల్దార్ గుర్తించాడు.
ఆ బొమ్మలేకుంటే చిన్నారి ఎంతగా అల్లాడిపోతుందో హవల్దార్ కు తెలుసు. దీంతో ఆ బొమ్మను ఎలాగైన ఆ చిన్నారికి చేర్చాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికే రైలు చాలా దూరం వెళ్లిపోయింది. ఆ బుడ్డొడి పేరు తప్ప భూషణ్ కి మరే వివరాలు తెలియదు. దీంతో వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేశాడు. అయితే ఎమర్జెన్సీ కేసుల కోసం పనిచేసే రైల్వే హెల్ప్ లైన్ ఓ కుర్రాడి బొమ్మ గురించి శ్రమ తీసుకుంటుందా? అనే సందేహం ఆయనకు లోలోపల కలిగింది. అయితే అతడి అంచనాలను తలక్రిందులు చేస్తూ రైల్వే అధికారులు కూడా అసాధారణ రీతిలో స్పందించారు. ఓ బృందాన్ని రంగంలోకి దింపి.. ఆ బొమ్మను ఆ బాలుడికి చేర్చేలా ఆదేశాలు ఇచ్చారు. ఇక ఆ బృందం రైల్వే ఛార్ట్ ఆధారంగా ఆ బాలుడి వివరాలు కనిపెట్టారు.
పశ్చిమబెంగాల్ లోని ఉత్తర్ దినాజ్ పూర్ జిల్లా ఖాజీ గ్రామంలో ఉంటున్న మోహిత్ రజా, నస్రీన్ బేగంలో కుమారుడే అద్నాన్. చివరకు పోలీసులు వారి ఇంటికి వెళ్లి ఆ బొమ్మను బాలుడికి అందజేశారు. దీంతో ఆ బుడ్డోడు సైతం చిరునవ్వులు చిందించాడు. తమ బిడ్డ సంతోషం కోసం ఇండియన్ ఆర్మీ, రైల్వేశాఖ వారు తీసుకున్న ఇంతటి శ్రమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై హవల్దార్ పట్నాయక్ కూడా స్పందించారు. “బొమ్మను ఆ బాలుడికి అందించకుండా ఉన్నట్లయితే నాకు మనశ్సాంతిగా ఉండేది కాదు” అని అన్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.