ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవరు ఊహించలేరు. అయితే కొన్ని ప్రమాదాలు నరకం చూపిస్తాయి. ఇటీవలే ఓ వ్యక్తి గుప్త నిధుల కోసం వెళ్లి రెండు రాళ్ల మధ్య ఉన్న సొరంగంలో ఇరుక్కపోయాడు. అతడిని రక్షించేందుకు అధికారులు కొన్నిగంటల పాటు శ్రమించారు. తాజాగా ఓ బాలుడి విషయంలో అలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. బాలుడి మలద్వారంలో ఇనుప గునపం దిగింది. దీంతో ఆ బాలుడు కొన్నిగంటల పాటు నరకం అనుభవించి.. చివరకు...
ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవరు ఊహించలేరు. అయితే కొన్ని ప్రమాదాలు నరకం చూపిస్తాయి. ఇటీవలే ఓ వ్యక్తి గుప్త నిధుల కోసం వెళ్లి రెండు రాళ్ల మధ్య ఉన్న సొరంగంలో ఇరుక్కపోయాడు. అతడిని రక్షించేందుకు అధికారులు కొన్నిగంటల పాటు శ్రమించి.. చివరకు బయటకు తీశారు. అలానే మరో ప్రాంతంలో ఓ బాలుడు కడుపులో స్టీల్ గ్లాస్ ను వైద్యులు గుర్తించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి ఆ గ్లాస్ ను బయటకు తీశారు. తాజాగా ఓ బాలుడి మలద్వారంలోకి ఇనుప గునపం చొచ్చుకోపోయింది. దీంతో ఆ బాలుడు కొన్ని గంటల పాటు నరకం అనుభవించాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒడిశా రాష్ట్రం కొంధమాల్ జిల్లా కోటగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సువర్ణగిరి ప్రాంతానికి చెందిన సనాతన పటగురు అనే వ్యక్తి భార్య పిల్లలతో కలసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు శక్తి పటగురు (16) స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా పాఠశాలకు శక్తి పటగురు వెళ్లాడు. అక్కడ పిల్లలతో కలసి పాఠశాలకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో తరగతి గదుల్లో పైకి ఎక్కి సిమెంట్ రేకులను తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో వాటిలోని ఓ రేకు విరిగిపోయింది. దీంతో దానిపైన ఉన్న శక్తి పడగురు ఒక్కసారిగా కిందకు జారాడు. అదే సమయంలో అక్కడే ఓ వ్యక్తి ఇనుప గునపం పట్టుకుని నిల్చున్నాడు. బాలుడు తరగతి గదిపై నుంచి నిటారుగా ఉన్న గనుపంపై పడ్డాడు.
దీంతో బాలుడి మలద్వారంలోకి ఆ గనుపం చొచ్చుకుపోయింది. బాలుడిని గమనించిన ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బలిగుడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఎమ్కేసీజీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు శనివారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు శస్త్రచికిత్స చేశారు. సుదీర్ఘంగా శ్రమించిన వైద్యులు చివరకు బాలుడిలోకి వెళ్లిన గునపాన్ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలుడు ప్రాణాలతో బయటపడ్డంతో అతడి తల్లిదండ్రులతో పాటు స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.