ఈ భూమి మీద అన్నింటి కంటే విలువైనది తల్లి ప్రేమ. ఆ ప్రేమకు సాటి వచ్చేది అంటూ ఏమి ఉండదు. బిడ్డపై తల్లి చూపించే ప్రేమ అనంతమైనది. తన బిడ్డ ప్రాణాలకు ఆపద వాటిల్లిందంటే ఏ పోరాటానికైనా తల్లి సిద్ధపడుతుంది. తాజాగా బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ తల్లి హైనాతో పోరాటం చేసింది. అయితే ఆమె పోరాటం వృథా అయింది.
ఈ భూమి మీద అన్నింటి కంటే విలువైనది తల్లి ప్రేమ. ఆ ప్రేమకు సాటి వచ్చేది అంటూ ఏమి ఉండదు. బిడ్డపై తల్లి చూపించే ప్రేమ అనంతమైనది. నవమాసాలు మోసి, కని.. ఏ కష్టం రాకుండా బిడ్డను పెంచుతుంది. తన అవసరాలను, సుఖాలను వదులుకుని బిడ్డల యోగ క్షేమాలు చూస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తన ప్రాణాల గురించి ఆలోచించకుండా బిడ్డల ప్రాణాలను రక్షించేందుకు తాపత్రయపడుతుంది. అలా బిడ్డల ప్రాణాలను రక్షించేందుకు తమ ప్రాణాలు కోల్పోయిన తల్లులు ఎందరో ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా.. తాజాగా ఛత్తీస్‌గఢ్ లో చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఓ హైనా ఎత్తుకెళ్లింది. దీన్ని గమనించిన తల్లి.. హైనా వెంట 3 కి.మీ పరిగెత్తి బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగ్‌దల్‌పూర్ జిల్లా చిత్రకూట్ అటవీ ప్రాంతం సమీపంలో నైన్నార్ అనే గ్రామం ఉంది. అయితే ఆ గ్రామంలోని ఓ కుటుంబం తమ పనుల్లో నిమగ్నమై ఉండగా వాళ్ల బాబు.. ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. బాలుడు ఆడుకుంటున్న ప్రాంతానికి అకస్మాత్తుగా పొదల్లో నుంచి హైనా వచ్చింది. దీంతో పిల్లవాడు గట్టిగా అరిచాడు. అందరూ తెరుకునే లోపే.. క్షణాల్లో ఆ చిన్నారిని నోట కరచుకుని అడవి వైపు హైనా పరుగులు తీయడం ప్రారంభించింది. వెంటనే ఆ బాలుడి తల్లి హైనా వెనుక పరిగెత్తింది. కొందరు గ్రామస్థులు కూడా ఆ మహిళ వెనుకు పరిగెత్తారు. తన బిడ్డను ఎలాగైన రక్షించుకోవాలని దాదాపు 3 కి.మీ హైనాను వెంబడించింది.
మహిళ వేగంతో పోటీ పడలేక గ్రామస్థులు వెనకాలే ఆగిపోయారు. ఆ మహిళ హైనాతో చాలా సమయం పాటు పోరాడి.. చివరకు బాలుడిని విడిపించారు. తీవ్రగాయాలపాలైన చిన్నారిని సమీపంలోనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ తల్లి గుండెలు పగిలేలా రోధించింది. తన ప్రాణాలు తీసుకున్న బాగుండు కదా దేవుడా! అంటూ కన్నీరు మున్నీరు అయింది. ఆ తల్లి వేదనను చూసిన గ్రామస్థుల హృదయాలు బరువెక్కాయి. బిడ్డ కోసం ప్రాణాలకు తెగించి హైనా పోరాటం చేసిన ఈ తల్లి, ఇలాంటి వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.