జాతీయ రహదారులపై నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడమే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం. తాజాగా తమిళనాడులో ఓ ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషయంగా ఉంది. అతివేగంగా బస్సులు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులో ఎడప్పాడి సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషయంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రెండు బస్సుల డ్రైవర్లు అతివేగంగా బస్సులు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా అతి వేగంగా వాహనాలు నడిపేవారిపైన పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారిలో మార్పు రావడం లేదు.. ప్రమాదాలు జరగడం ఆగడం లేదు. వీళ్లు చేసిన తప్పుకు అనేక మంది అమయాకుల జీవితాలు బలవుతున్నాయి. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Tamil Nadu: Two private buses collided head-on with each other in Salem district; several reported to be injured. Further details awaited.
(Source Unverified) pic.twitter.com/8FAJ0KRizk
— ANI (@ANI) May 18, 2022
ఇదీ చదవండి: పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రమాదం.. ఐసీయూలో చికిత్స!