సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని అనర్థాలు కూడా ఉన్నాయని అంటారు. కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తుంటాయి. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట ప్రత్యక్షం అవుతున్నాయి. కొన్నివీడియోలు కడుపుబ్బా నవ్విస్తుంటే.. కొన్నిమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటున్నాయి. ఇక ఏదైనా కాంట్రవర్సీకి సంబంధించిన వీడియో అయితే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు కాంట్రవర్సీ ఫోటోలు, వీడియోలతో సెలబ్రెటీలు ఇరుకున పడ్డ సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు సోషల్ మీడియాని ఫాలో అవుతూనే ఉన్నారు. సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టం కూడా ఉంది. ముఖ్యంగా సోషల్ మాద్యమాల్లో ఫోటోలు, వీడియోలు చూసినంత వరకు ఓకే.. కానీ వాటికి లైక్ కొట్టి, షేర్ చేసేటపుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఒక్క లైక్ కొంపలు ముంచే అవకాశం ఉంది. కొంతమంది అనవసరపు కామెంట్స్ చేసి అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన కనల్ కన్నన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత నెల 18న కనల్ కన్నన్ ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వాస్తవానికి ఈ వీడియో వేరే దేశానికి సంబంధించినదే అయినా.. దాన్ని కనల్ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఇది కాస్త సైబర్ క్రేమ్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో మ్యాటర్ చాలా సీరియస్ అయ్యింది. ఓ మతం వాళ్ల మనోభావవాలు దెబ్బతీశాడని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాగర్ కోయిల్‌కి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కనల్ కన్నన్‌ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే కనల్ కన్నన్‌ని ఇలా అరెస్ట్ కావడం కొత్తేమీ కాదు.. గతంలోనూ సోషల్ యాక్టివిస్ట్ పెరియార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలయ్యాడు.
Kollywood stunt master and actor Kanal Kannan arrested by cyber crime police in Nagercoil for sharing a video of a pastor dancing with a woman, on social media: Tamil Nadu Police
— ANI (@ANI) July 10, 2023