నేటికాలంలో చాలా మంది యువకులు వివిధ కారణాలతో పెళ్లికాక బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. మరికొందరు అయితే శతవిధాల ప్రయత్నించి.. అతికష్టం మీద పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి వయస్సు దాటిపోతుండటంతో చాలా మంది యువకులు ముందు వెనుకా ఆలోచించకుండా పెళ్లి చేసుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొందరు యువతులు పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తికి 30 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లికాలేదు. చివరికి ఓ బ్రోకర్ కు డబ్బులు ఇచ్చి మరీ ఓ అమ్మాయితో పెళ్లి కుదిర్చుకున్నాడు. ఇక పెళ్లి అయిన సంతోషంలో ఆ వ్యక్తి ఉండగా పెళ్లి కూతురు చేసిన పనికి అందరికి కళ్లు బైర్లు కమ్మాయి. ఇంతకి ఆమె ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ ప్రాంతానికి చెందిన అటల్ బిహారీ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతడికి వయస్సు 35 ఏళ్లు కావడంతో పెళ్లి కావడం కష్టంగా మారింది. అతడికి ఆస్తి బాగానే ఉన్నా పెళ్లికి అమ్మాయి మాత్రం దొరకడం లేదు. అతడి తల్లిదండ్రులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఎవరు పిల్లను ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. దీంతో అతడు మానసికంగా కూడా కుంగిపోయాడు. ఈ క్రమంలోనే అటల్ తల్లిదండ్రులకు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ బ్రోకర్ పరిచయమయ్యాడు. తమ బిడ్డ పెళ్లి కోసం వారు పడుతున్న తిప్పలను వివరించారు. తమ అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తే డబ్బులిస్తామని కూడా అటల్ తల్లిదండ్రులు తెలిపారు.
ఈక్రమంలో ఆ బ్రోకర్ కు రూ.3 లక్షలు చెల్లించి మరీ ఓ పెళ్లి కుదుర్చుకున్నారు. జైస్వాల్ సోనా అనే యువతితో అటల్ కి వివాహం నిశ్చయమైంది. ఇటీవలే వారి వివాహం జరిగింది. ఇక పెళ్లైందనే సంతోషం అటల్ మునిగితేలాడు. అయితే పెళ్లైన తరువాత 15 రోజులకు జైస్వాల్ అత్తింటి వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అత్తింటి నుంచి రూ.3 లక్షల విలువైన బంగారు నగలతో ఉడాయించింది. తన భార్య కనిపించడం లేదని చుట్టు పక్కల ప్రాంతాలన్ని వెతికాడు. అంతేకా సమీపంలోని పట్టణంలోకి సైతం వెళ్లి వెత్తికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఖాకీలు సోనా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ కి వెళ్లారు.
అక్కడ రెండు రోజుల పాటు జల్లెడ పట్టి.. చివరకు భోపాల్ లో సోనా ఇంటి అడ్రెస్ ను కనిపెట్టారు. అంతేకాక ఆమెను అదపులోకి తీసుకుని విచారించాగా విస్తుతపోయే నిజాలు తెలిశాయి. ఆమెకు ఇదివరకే పెళ్లి అయినట్లు తెలిసింది. ఇక పోలీసులు ఆమెపై కేసు పెట్టి.. విచారణ చేపట్టారు. ఈ మధ్యకాలంలో ఇలా పెళ్లికాక ఇబ్బందులు పడుతున్న యువకులు అనేక మంది మోసపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరీ.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.