ఎంతో సంతోషంగా జరగాల్సిన వివాహ వేడుకలు కొన్ని సార్లు ఘర్షణలకు కారణమవుతున్నాయి. తాజాగా జరిగిన ఒక పెళ్లి వేడుక గొడవకు దారి తీసింది. పెళ్లికి హాజరైన అతిథులు, అక్కడి హోటల్ సిబ్బంది పరస్పరం దాడి చేసుకున్నారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే మధురమైన వేడుక. అందుకే యువత తమ పెళ్లిపై ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకుంటారు. అందుకు తగినట్లే అంగరంగా వైభవంగా పెళ్లిళ్లు జరుపుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలు ఘర్షణలకు వేదికగా మారుతుంది. కారణాలు ఏమైనప్పటికి చిన్నగా మొదలయ్యే గొడవలు భౌతిక దాడుల వరకు వెళ్తాయి. ఇలాంటి ఘర్షణల్లో పలువురు గాయాల పాలవుతుంటారు. తాజాగా డీజే విషయంలో పెళ్లి వారికి హోటల్ సిబ్బందికి ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో హోటల్ సిబ్బంది పెళ్లి వారిపై దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మసూరి అనే ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంలో పెళ్లి వేడుక జరుగుతుంది. ఈ పెళ్లి కోసం సమీప పట్టణమైన గోవింద్ పురిలోని గ్రాండ్ ఐరిస్ అనే హోటల్ ను బుక్ చేసుకున్నారు. శనివారం సాయంత్ర గ్రాండ్ ఐరిస్ హోటల్ లో మెహిందీ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వధువరుల తరపు బంధువులు భారీగా వచ్చారు. డీజే పాటలకు డ్యాన్స్ లు వేస్తూ పెళ్లి వారు తెగ సందడి చేశారు. అలా అర్థరాత్రి 12 దాటిన సరే పెళ్లి వారు మెహిందీ వేడుకలో మునిగి తేలుతున్నారు.
హోటల్ సిబ్బంది వచ్చి ఆ డీజేను అర్ధరాత్రి 02.00 గంటలకు ఆపేశారు. దీనిపై వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంత సమయం పాటు డీజే పెట్టమని చెప్పారు. అయితే హోటల్ సిబ్బంది మాత్రం నిరాకరించారు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి, పెళ్లి వారికి మధ్య గొడవ తలెత్తింది. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివాన తుఫాన్ గా మారినట్లు పెద్ద ఘర్షణగా మారింది. పెళ్లి వారు, హోటల్ సిబ్బంది పరస్పరం దాడి చేసుకున్నారు.
ముఖ్యంగా హోటల్ సిబ్బంది, బౌన్సర్లు కలిపి వరుడితోపాటు, అతడి బంధువులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో పెళ్లి వారిలో పలువురు గాయపడ్డారు. దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మింది మందిని అరెస్టు చేశారు. మరి కొందరు పరారీలో ఉండటంతో వారి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023