పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి.. వారి ఉన్నత స్థితికి ఎదిగేలా చేసేవారే గురువు. విద్యార్ధులకు ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలియజేస్తూ.. వారిని సమాజంలో ఓ మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే కర్తవ్యం గురువులది. మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో గురువులదే కీలక పాత్ర. అందుకే వారికి సమాజంలో ఎంతో గౌరవ, మర్యాదలు ఉంటాయి. అయితే కొందరు.. గురువుల స్థానానికి మాయని మచ్చ వచ్చే పనులు చేస్తున్నారు. తమ సొంత బిడ్డలా భావించాల్సిన పిల్లలపై లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆడపిల్లలను వేధిస్తున్నాడని.. తల్లిదండ్రులు ఓ ఉపాధ్యాయుడు చెప్పులతో కొట్టారు. తాజాగా జరిగిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆజంఘడ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయునిపై కొందరు మహిళలు దాడి చేశారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో సదరు టీచర్ పై చెప్పులతో బడిత పూజ చేశారు. అతడి చెంపలు బూరెలు అయ్యేంతలా మహిళలు చెప్పులతో వాయించారు. అయితో ఆ టీచర్ పై దాడి చేస్తున్న మహిళలను ఆపేందుకు తోటి ఉపాధ్యాయులు అడ్డుగా వచ్చారు. అయిన వాళ్లను కూడా పక్కకు నెట్టి ఆ వ్యక్తిని చెప్పులతో వాయించారు. ఈక్రమంలో ఆ మహిళలను ఆపేందుకు ప్రయత్నించి ఇతర ఉపాధ్యాయులకు కూడా చెప్పు దెబ్బలు పడ్డాయి. అయితే ఆ ఉపాధ్యాయుడు పాఠశాలలోని ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తున్నట్లు సమాచారం.
అతడు చేసే ఆకృత్యాలను పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పారు.దీంతో ఆగ్రహంతో ఆ కీచక టీచర్ పై దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ లోని ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మరువక ముందే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. నెటిజన్లు సదరు టీచర్ ను ఏకి పారేస్తున్నారు.
आजमगढ़ के पवई थाना क्षेत्र में स्थित एक प्राथमिक विद्यालय में अध्यापक पर छात्रा के साथ कथित रूप से अश्लील हरकत करने का आरोप। महिला शिक्षकों ने मिलकर अध्यापक की कर दी पिटाई।#Azamgarh #UttarPradesh #Teacher pic.twitter.com/csLvFuc15t
— UP Tak (@UPTakOfficial) October 20, 2022