భారత నౌకాదళ యుద్ధనౌక INS రణ్ వీర్ లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి మందుగుండు సామాగ్రి కారణం కాదని అధికారులు ప్రకటించారు. నౌక అంతర్గత ప్రదేశంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముంబయి నేవల్ డాక్ యార్డ్ లో ఉండగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
BREAKING: 3 Navy personnel killed in an accidental blast on board destroyer INS Ranvir. The ship was in harbour in Mumbai. Several injured sailors under treatment on shore. Further details awaited. @IndiaToday pic.twitter.com/GoFy5z0wfV
— Shiv Aroor (@ShivAroor) January 18, 2022
నౌకలోని ఏసీ కంపార్టుమెంట్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఆ గదికి పక్కనే ఉన్న సిబ్బంది మృతి చెందారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి మంటలను అదుపు చేశారు. గ్యాస్ లీక్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి క్యాబిన్ కూలి పోయింది. ఈ ప్రమాదానికి మందు గుండు సామాగ్రి కారణం కాదని అధికారులు వెల్లడించారు.
తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ ఎస్ రణ్ వీర్ యుద్ధనౌక విశాఖ కేంద్రం సేవలు అందిస్తోంది. అయితే క్రాస్ కోస్ట్ మోహరింపుల్లో భాగంగా ముంబయి కేంద్రంగా గస్తీ కాస్తోంది. నౌకలోని సిబ్బంది కూడా విశాఖలోనే నివాసముంటున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో రణ్ వీర్ విశాఖ తిరిగి రావాల్సి ఉంది. ఈ వార్త తెలిసి విశాఖ నౌకాదళ కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
The 3 @IndianNavy personnel who tragically died in the blast on board destroyer INS Ranvir yesterday in Mumbai. pic.twitter.com/kbL0YhZMsj
— Shiv Aroor (@ShivAroor) January 19, 2022
1986 నుంచి ఐఎన్‌ఎస్ రణ్ వీర్ ఇండియన్ నేవీలో సేవలందిస్తోంది. ఈ నౌకను రష్యా నిర్మించింది. రాజ్ పుత్ క్లాస్ కు చెందిన నాలుగో విధ్వంసకర యుద్ధనౌక ఇది. దీనిలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ వ్యవస్థ ఉంటుంది.