ఇండియన్ నేవీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. 10+2 అర్హత ఉంటే కనుక మీరు నెలకు రూ. 30 వేలు జీతం అందుకునే అవకాశం ఉంటుంది.
సైన్యంలో పనిచేయాలన్నది మీ కోరికా! అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం సాధిస్తే దేశం కోసం సేవ చేసినట్లు ఉంటుంది మరియు వేలకు వేలు జీతం పొందవచ్చు.
కేరళలో ఖైదీ మూవీ సన్నివేశం రిపీట్ అయ్యింది. భారీ స్కెచ్ వేసి మరీ రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. సముద్రజలాల్లో భారత్ కు డ్రగ్స్ ని తరలిస్తున్న ఓడను ఛేజ్ చేసి మరీ 2500 కిలోల ప్రమాదకరమైన డ్రగ్ ని పట్టుకున్నారు.
నిరుద్యోగులకు ఇండియన్ నేవీ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 242 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా, అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ వంటి పైచదువులు చదివిన వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి.
దేశ సేవ, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలు పణంగా పెడుతుంటారు జవాన్లు. కుటుంబాన్ని వదిలేసి.. ఇంటికి దూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉండే సరిహద్దుల్లో పహారా కాస్తారు. కఠినమైన శిక్షణలు తీసుకుంటారు. కానీ అవి ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఓ జవాన్ ప్రమాదవశాత్తూ మృత్యు ఒడికి చేరాడు.
చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాలు నేలపై నుంచే కాకుండా నీటిపైనుంచి కూడా దాడులకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి నావికా దళానికి ఓ పిలుపు నిచ్చారు. భవిష్యత్తు గొడవలకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఇంటర్ తరువాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అపారం. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాఉంటాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటే.. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు లేదా సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి పైచదువులు పూర్తిచేయవచ్చు. లేదు విద్యతో పాటు ఉపాధి కావాలనుకుంటే రక్షణ రంగాల వైపు అడుగులు వేయటం ఉత్తమం. ఇండియన్ నేవీ – 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష […]
భారత నావికాదళం అమ్ములపొదిలోకి మరో సబ్‌మెరైన్ చేరింది. కల్వరీ క్లాస్ సబ్‌మెరైన్స్‌లో చివరిది, ఐదోది అయిన ‘ఐఎన్ఎస్ వాగీర్’ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంఛనంగా ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ ఇందుకు వేదికైంది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఈ కొత్త సబ్‌మెరైన్ సొంతం. వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువులను ఎదుర్కోవడం, వారి నుంచి దేశ ప్రయోజనాలను సంరక్షించడం సులభతరం అవుతుందని […]
ఏ పని చేయకపోవడం కంటే ఏదో ఒక పని చేయడం మంచిది కదా. ఖాళీగా ఉండడం కంటే వర్క్ నేర్చుకోవడం కూడా ఒక పనే. అప్రెంటీస్ పనే కదా, ఏడాదే ఉంటుంది కదా అని లైట్ తీసుకోకండి. ఈ ఒక్క ఏడాదిలో మీరు నేర్చుకున్న పని అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవంతో ఎక్కడైనా బతకచ్చు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ లో 2023-24 ఐటీఐ బ్యాచ్ కి ట్రైనింగ్ […]
భారత నౌకాదళం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నేవీలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అదికూడా రూ.56,100 ప్రారంభ జీతంతో షార్ట్ సెర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్హతలు కలిగిన ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇవాళ్టి(అక్టోబర్ 21) నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసేందుకు నవబంర్ 6 ఆఖరి తేదీగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను joinindinannavy.gov.in అధికారకి వెబ్‌సైట్‌లో ప్రకటించారు. […]