ఈ మద్య దొంగలు రక రకాలుగా దొంగతనాలు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి అందినంత దోచుకుంటున్నారు. ఈజీ మనీ కోసం ఏ పని చేయడానికైనా సిద్దపడుతున్నారు.
ఇటీవల కాలంలో కొంతమంది దొంగలు మరీ బరితెగించిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఎలాంటి పనికైనా సిద్దపడుతున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లాంటివి చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడినా కొంతకాలం జైలు జీవితం అనుభవించి తిరిగి వచ్చి మళ్లీ అవే పనులు చేస్తున్నారు. ఆ మద్య ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన సంఘటన సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. తాజాగా అలాంటి ఘటనో మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కలబురగిలోని ఓ బస్టాండ్ లో దొంగ ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లాడు. దొంగ తెల్లవారుజామున ఎవరూ లేని సమయం చూసి బస్టాండ్ లోకి ప్రవేశించి కేకేఆర్టీసీ ప్రభుత్వ బస్సును ఎత్తుకెళ్లాడు. ఉదయం ఆర్టీసీ సిబ్బంది వచ్చిన చూస్తే బస్సు కనిపించకుండా పోయింది. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికాలు వచ్చి సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి.. దొంగ బస్సుతో తాండూర్ మీద నుంచి తెలంగాణలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. రవాణాశాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బస్సును కనిపెట్టేందుకు కేఎస్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బస్సు తెలంగాణ రాష్ట్రంలో ఉండవొచ్చునని.. గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. త్వరలోనే ఆ బస్సుతోపాటు దొంగను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. గతంలో వరంగల్ జిల్లా పాలకొండ ఆర్టీసీ బస్ డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ కి ఎదురుగి నిలిపి వెళ్లాడు. ఉదయం వచ్చి చూడగా బస్సు మాయం అయ్యింది. గోకర్ణపల్లికి చెందిన సురేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో తన ఇంటికి వెళ్లడానికి ఏకంగా బస్సునే ఎత్తుకు వెళ్లినట్టు పోలీసు ముందు ఒప్పుకున్నాడు. దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి.