అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు రోజుకొక నిర్ణయంతో సంచలనంగా మారుతున్నారు. గతంలో కాబూల్ మినహా దేశం మొత్తాన్ని ఆక్రమించుకుని అఫ్ఘాన్ దేశ ప్రజలకు చుక్కలు చూపించారు. ఇక ఇటీవల కాబూల్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటంతో వారికి మరింత శక్తి లభించినట్లైంది. దీంతో తాజాగా తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ మీడియాతో మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ తో పాటు ముస్లీంలు మరే ప్రాంతంలో ఉన్నవారి హక్కుల గురుంచి మేము పాటుపడతామని సుహైల్ షహీన్ తెలిపారు. మీ సొంత ప్రజలు, మీ స్వంత పౌరులని చెబుతాం, మీ చట్టాల ప్రకారం వారికీ సమాన హక్కులుంటాయని తెలియజేస్తామని సుహైల్ షహీన్ వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉంటే తాలిబన్స్ ఆ దేశంలో చేస్తున్న అరాచకాలతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.