Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించింది. 1988లో చోటుచేసుకున్న ఓ వివాదానికి సంబంధించిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిద్ధూకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు సిద్ధూ పేర్కొన్నాడు. ట్విటర్ వేదికగా గురువారం ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. కాగా, 1988 డిసెంబర్ 27న సిద్ధూ, అతడి స్నేహితుడు రూపిందర్ సింగ్ సందూలు రోడ్డుపై వెళుతుండగా గురునామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవైంది. ఈ నేపథ్యంలో సిద్ధూ, సందులు గురునామ్‌పై దాడి చేశారు. అతడి తలపై బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సిద్ధూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ కేసుకు సంబంధించి 2007లో పంజాబ్, హర్యానా కోర్టు సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సిద్ధూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018లో దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కింది కోర్టు విధించిన 3 ఏళ్ల జైలును 1000 రూపాయల జరిమానాగా మార్చింది. అయితే, ఈ తీర్పుపై గురునామ్ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టులోనే రివ్యూ పిటిషన్ వేశారు. తమ బాధను లెక్కలోకి తీసుకుని సిద్ధూకు తగిన శిక్ష విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపి తీర్పును వెలువరించింది. మరి, నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్షపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయజేయండి.
ఇవి కూడా చదవండి : Uttarakhand: కుమారుడిని వివాహం చేసుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త!