మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ఆ బాటిల్ మీదే ఉన్నా కూడా.. కళ్లు మూసుకుని తాగేస్తుంటారు. అయితే ఇంతకాలం మద్యం తాగడంలో పురుషుల లెక్కలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చేవాళ్లు. ఇప్పడు రాష్ట్రాల వారీగా మద్యం సేవించే మహిళల లెక్కలు కూడా బయటకు వచ్చాయి.
దేశవ్యాప్తంగా మద్యం సేవించేవారు కోట్లలో ఉన్నారు. ప్రతి రోజు కొన్ని లక్షల లీటర్ల మద్యం విక్రయించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మద్యం సేవించే వాళ్ల సంఖ్య బాగానే ఉంది. ఇంక పండగలు, న్యూఇయర్ లాంటి సందర్భాల్లో అయితే ఎక్కడైనా బీరులు ఏరులై పారతాయి. అయితే ఇప్పటివరకు చాలా మంది మగవాళ్లు మద్యం సేవించడం గురించే మాట్లాడుతుంటారు. మరి ఆడవాళ్లు మందు తాగరా? అని ప్రశ్నిస్తే తాగుతారనే చెప్పాలి. కాకపోతే పురుషుల రేంజ్ లో కాకపోయినా కాస్తో కూస్తో పుచ్చుకుంటారు. అయితే అందుకు సంబంధించిన లెక్కలు కొన్ని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రం ఏదైనా, ప్రాతం ఏదైనా మద్యం సేవించని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తే అవుతుందేమో? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆ రేంజ్ లో మద్యం తాగేస్తున్నారు. నిజానికి రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం మద్యం అమ్మకాల నుంచే వస్తుందని అందరికీ తెలుసు. ఎందుకంటే మద్యంపై పన్ను ఎక్కువగా వసూలు చేస్తారు కాబట్టి. అయితే అందరూ ఎప్పుడూ పురుషులు మద్యం సేవించడం గురించే ఎక్కువగా ప్రస్తావిస్తారు. అంటే మహిళలలు అసలు తాగరు అని కాదు. వాళ్లు కూడా తాగుతారు. కాకపోతే మెజారిటీ సభ్యులు పురుషులు ఉండటంతో వారి లేక్కలే ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి. ఇప్పుడు మహిళల్లో మద్యం సేవించే వారి లెక్కలు కూడా బయటకు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం ప్రతి 14 మంది పురుషులకు కేవలం ఒక్క మహిళ మాత్రమే మద్యం సేవిస్తోంది.
అవును మహిళలు- పురుషుల మద్యం సేవించే రేషియో చూస్తే.. 1:14 అని తేలింది. అందుకు సంబంధించిన ఓ నివేదిక కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏపీలో 0.5 శాతం మంది మహిళలు, 23 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. ఇంక తెలంగాణ విషయానికి వస్తే.. 6.7 శాతం మంది మహిళలు, 43 శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు. ఇంక అన్ని రాష్ట్రాల్లో కెల్లా అరుణాచల్ ప్రదేశ్ లో మద్యం సేవించే వాళ్లు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో 24.2 శాతం మంది మహిళలు, 53 శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు. రెండో స్థానంలో సిక్కిం ఉంది. అక్కడ 16.2 శాతం మంది మహిళలు, 40 శాత మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు.