వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వేసవి కాలం మొదలయింది. దేశంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఎటైనా టూర్ వెళ్లాలన్నా లేదా ఊరెళ్ళలన్నా ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. అయితే సమ్మర్ లో ట్రైన్స్ ఖాళీగా ఉండటం అన్నది దాదాపు అసాధ్యం. వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా పలు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు..
హైదరాబాద్ నుంచి సోలాపూర్ కు ఈ నెల 24 నుంచి మే 14వ వరకు ప్రతిరోజూ స్పెషల్ ట్రైన్(07003) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇది ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు బయలుదేరి హైదరాబాద్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు గమ్య స్థానానికి చేరుకుంటుంది. అలాగే సోలాపూర్ నుంచి హైదరాబాద్ కు ఓ స్పెషల్ ట్రైన్(07004) నడపనున్నట్లు తెలిపింది. ఇది ప్రతిరోజూ మధ్యాహ్నం 1.20 గంటలకు సోలాపూర్ నుండి బయలుదేరి.. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. అదే విధంగా మరికొన్ని స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.