ఎన్నో కష్టాలు భరించి నవమాసాలు మోసి జన్మనిస్తుంది అమ్మ. పెంచే క్రమంలో ఆమె అనేక కష్టాలు పడుతుంది. అయినా ఆమెకు సంతోషమే.. ఎందుకంటే తన సుఖం కంటే తన బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకుంటుంది. అలా పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వాడిని చేస్తే.. ఆ తల్లికే నరకం చూపిస్తున్నారు కొందరు పుత్ర ‘రత్నాలు’. కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లేగా హింసించారు ఇద్దరు కన్న కొడుకల రూపంలో ఉన్న కర్కోటకులు. తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తమిళనాడులోని తంజావుర్ జిల్లా కావేరి నగర్ కు చెందిన జ్ఞానజ్యోతి(62). ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్ చెన్నైలో ఇన్ స్పైక్టర్. చిన్న కుమారుడు వెంకటేశన్ కూడా ప్రభుత్వ ఉద్యోగి. పదేళ్ల క్రితం జ్యోతి భర్త అనారోగ్య కారణంగా మరణించారు. వారి కుమారులు ఆస్తి గొడవల కారణంగా వేరు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లిని పట్టించుకోకుండా పదేళ్ల కిందటే ఓ ఇంట్లో బంధించారు. వారానికి ఒకసారి బిస్కెట్లు తెచ్చి గేట్ లో నుంచి విసిరేసేవారు.
అలా ఆమెకు నరకం చూపించారు. స్థానికులే ఆమె దారుణ పరిస్థితి చూసి ఆహారం పెట్టేవారు. ఇటీవల ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆమెను కాపాడారు. పోలీసులు ఆమె కుమారులిద్దరని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఆమె మానసిక స్థితి సరిగాలేదు. చికిత్స కోసం తంజావుర్ ప్రభుత్వం తరలించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.