దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ.20 కోట్ల విలువైన నగల దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. పట్టపగలు ఆయుధాలతో చొరబడి దుండగులు నగలు అపహరించారు. అయితే దోపిడీకి గురైన నగల్లో కొన్ని స్థానిక ఇన్‌స్పెక్టర్ ఇంట్లో లభించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వార్త విన్న తర్వాత అంతా కంచె చేను మేస్తే అన్న చందాన ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే..
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థకు చెన్నైలోని అరుంబాక్కంలో ఒక బ్రాంచ్ ఉంది. ఆగస్టు 13న మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు చొరబడి సిబ్బంది, కస్టమర్లను కత్తులతో బెదిరించారు. అక్కడున్న రూ.20 కోట్ల విలువజేసే బంగారు నగలు, డబ్బు దోచుకెళ్లారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ కేసు దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి కేసు కొత్త మలుపులు తిరుగుతూ వచ్చింది. ఆ ఫెడ్ బ్యాంక్ లో పనిచేసే వ్యక్తులే దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందుల కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. ఈ దోపిడీ జరిగిన తర్వాతి రోజే సంతోష్, బాలాజీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు 8.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
సంతోష్ పోలీసులకు కీలక సమాచారం అందజేశాడు. తర్వాత మురుగన్, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అచరపాక్కమ్ ఇన్ స్పెక్టర్ అమల్ రాజ్ ఇంట్లో బంగారం దాచినట్లు సంతోష్ తెలిపాడు. అమల్ రాజ్- సంతోష్ బంధువులు కావడంతో పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. అమల్ రాజ్ ఇంట్లో 3.7 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమల్ రాజ్, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే వారికీ ఆ నగలకు ఎంలాంటి సంబంధం లేదని అమల్ రాజ్ పేర్కొన్నారు. సంతోష్ వారికి బంధువైన మాట వాస్తమేమని.. దోపిడీ జరిగిన రాత్రి సంతోష్ తమ ఇంటికి వచ్చినట్లు వెల్లడించారు. అతను బంగారం దాచిపెట్టినట్లు తమకు తెలియదని తెలిపారు. పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ ఆభరణాల దోపిడీ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ దోపిడీ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bank Robbery at FED Bank , Gold Loans,a subsidiary of Federal Bank in Arumbakkam: More than 15 kilo gold jewellery were looted by a staff named Murugan and his associates.@THChennai pic.twitter.com/6emPb4zjzn
— R SIVARAMAN (@SIVARAMAN74) August 13, 2022