Parents:తల్లీతండ్రి గురువుదైవంతో సమానం అన్నారు పెద్దలు. అంటే దేవుడి, గరువు కన్నా ముందు స్థానం తల్లిదండ్రులకు ఇచ్చారు. ఒక్కప్పుడు పిల్లలు పెద్దవారికి అలానే గౌరవం ఇచ్చేవారు. కానీ నేటికాలం పిల్లలు మాత్రం మాకు ఆస్తులే ముద్దు.. అమ్మానాన్నలు వద్దు అంటున్నారు. దేవుడికి నైవేద్యాలు పెడుతున్నారు కానీ.. కన్నవారికి ముద్దం అన్నం మాత్రం పెట్టడం లేదు. బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసేవారొకరు, బతికుండగానే వల్లకాట్లో వదిలేసేవారొకరు. తాజాగా కరీంనగర్ లో ఓ వృద్ధులైన తల్లిదండ్రులను నిర్థాక్ష్యణంగా బయటకి గెంటేశారు వారి పుత్రరత్నాలు. మరి.. ఆవివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన అయిలయ్య(90), రావమ్మ(85) అనే వృద్ధ దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి పెళ్లిళ్లులు చేసి ఓ ఇంటి వారిని చేశారు. తనకున్న ఆరెకరాల భూమిని ముగ్గురుు కుమారులకు పంచిపెట్టారు అయిలయ్య. ఇల్లు మూడో కుమారుడికి ఇస్తే.. అతడు దాన్ని కూల్చి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పక్కనే తల్లిదండ్రులకు ఓ చిన్న రేకుల షెడ్డు నిర్మించాడు. కొన్నాళ్లకు అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆ దంపతులు చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని.. వారికి వచ్చే పింఛనుతో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే వారికి ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చే పింఛన్ డబ్బులు సరిపోవడం లేదు. దీంతో ఆ వృద్ధ దంపతుల బతుకు భారంగా మారింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు ఆ వృద్ధ దంపతులు.
ఇదీ చదవండి: తమ్ముడి మరణం.. మృతదేహంపైనే కుప్పకూలిన అక్క..!
తమకు జీవితం చివరి దశలో ఆదరం కావాలని ఆ వృద్ధులు కోరారు. దీంతో కుమారులు ఒక్కొక్కరు నెల రోజుల చొప్పున ఆ వృద్ధులను చూడాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. కానీ పెద్దల మాటలు ఆ ముగ్గురు కుమారులు పాటించలేదు. మూడో కుమారుడు వారిని ఇంట్లోకి రానీయలేదు. పెద్ద కుమారుడు తన ఇంటి నుంచి ఆ వృద్ధుల సామాగ్రిని బయట పడేయించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ దంపతులు ఇద్దరు 20 రోజులుగా స్థానిక సామాజిక భవనంలో తలదాచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారి కుమార్తెలు.. తల్లిదండ్రులను సోమవారం కలెక్టరేట్ కు తీసువచ్చి ప్రజావాణీలో ఫిర్యాదు చేయించారు. ఈ విషయం మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి వెళ్లడంతో.. తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మార్వోను ఆదేశించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.