ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో 224 సీట్లకు గాను.. కాంగ్రెస్ 135 స్థానాల్లో దూసుకు పోతుంది. ఫలితాలపై ఎంతో ధీమాగా ఉన్న బీజేపీ 65 స్థానాల్లో కొనసాగుతుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చేయి గుర్తు ప్రభంజనం సృష్టిస్తుంది. 224 సీట్లు ఉండగా.. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లింది. ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం మధ్యాహ్నం వరకు 135 స్థానాలు కైవం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం బీజేపీ 65 స్థానాలు, జేడీఎస్ 20 స్థానాలు, ఇతరులు 4 స్థానాలో గెలిచారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతలంగా టెన్షన్ లో ఉంటే.. సందిట్లో సడేమియ్యా అన్నట్లు కర్ణాటక శిగ్గావ్ లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్ లో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆఫీస్ లో ఉన్న సమయంలో కోబ్రా కనిపించడంతో భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కింగ్ కోబ్రాను పట్టుకునే సమయంలో బసవరాజ్ బొమ్మై అక్కడే ఉన్నారు. అయితే పాము వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల పై సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను. ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఎంతో శ్రమించారు.. అయినా కూడా అనుకున్న ఫలితం దక్కలేదు. మెజారిటీ మార్క్ చేరుకోవడంలో విఫలం అయ్యాం.. పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ఫలితాల్లో దూసుకు పోతుంది. ఫలితాలు పూర్తయిన తర్వాత పార్టీలో అంతర్మధనం చేసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టపతామని అన్నారు.
#WATCH Karnataka CM Basavaraj Bommai reaches the BJP camp office in Shiggaon, a snake found in the building compound slithers away
The snake was later captured and the building compound secured pic.twitter.com/FXSqFu0Bc7
— ANI (@ANI) May 13, 2023
#WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM’s presence pic.twitter.com/1OgyLLs2wt
— ANI (@ANI) May 13, 2023