ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో 224 సీట్లకు గాను.. కాంగ్రెస్ 135 స్థానాల్లో దూసుకు పోతుంది. ఫలితాలపై ఎంతో ధీమాగా ఉన్న బీజేపీ 65 స్థానాల్లో కొనసాగుతుంది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు చాలా కట్టుదిట్టంగా తనిఖీలు చేసి.. భారీగా నగదు, డ్రగ్స్, మద్యం పట్టుకున్నారు.
ఎన్నికల వేళ కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నేతలు ఇచ్చే హామీలు చూస్తే.. భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి హామీలు కూడా ఇస్తారా అనిపించకమానదు. కొందరు నేతలు ఏకంగా యువతకు వివాహాలు కూడా చేస్తామని హామీ ఇచ్చేస్తున్నారు. ఇంతకు ఎక్కడ అంటే..
హాస్య నటుడు బ్రహ్మానందం రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెట్టారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు ఈ ఎన్నికల ప్రచారమే.. ఓ ప్రత్యక్ష ఉదాహరణ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బ్రహ్మానందం ఓ బీజేపీ నేత తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. "ఏయ్ గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయి.." అంటూ మాస్ డైలాగ్స్ తో జనాలను ఉత్సాహపరిచారు.
ఈ నెల 10 వతేదీన కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. బీజెపీ, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ మ్యానిఫెస్టోలు, హామీల పర్వాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ధన ప్రవాహానికి హద్దు ఉండదు.
అసెంబ్లీ ఎన్నికల వేల విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమైంది.
మే 10న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. వ్యూహా, ప్రతి వ్యూహాలతో పార్టీలు దూసుకు వెళుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధికారం దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు బీజెపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) యోచిస్తున్నాయి. అయితే ఈ సమయంలో జెడీఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
కర్ణాటకలో ఎన్నికల వేళ ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.