దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం నివారణకు ఢిల్లీ సర్కార్ కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. ఆ దిశగా రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని వాహనాల ద్వారా అధిక పొల్యూషన్ వెలువడుతుండటంతో అడ్డుకట్ట వేసేందుకు రవాణ శాఖ సరికొత్త ప్రణాళికలు రూపొందించింది.
అయితే రోడ్డుపైకి వచ్చే ప్రతీ వాహనదారుడి వద్ద ఖచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపింది. వాహనాలను చెక్ చేసే క్రమంలో తమ వద్ద నున్న పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించాలని లేకుంటే రూ. 10 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీంతో పాటు సరైన పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే గనుక మీ యొక్క లైసెన్స్ ను మూడు నెలల పాటు రద్దు చేసే అవకాశం కూడా ఉందని తెలిపింది. దీంతో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం దృష్యా రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.