సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సొంత వ్యాపార రంగంలో రాణించాలనే వారికి ఇదే మంచి ఛాన్స్! కేంద్ర ప్రభుత్ం రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకు లోన్ అందించేందుకు ముందుకు వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు ప్రోత్సహిస్తుంది. దేశంలో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు మోడీ ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, తెగల వారిని కూడా ప్రోత్సహిస్తుంది. మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుంది. అయితే తాజాగా మహిళలకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా బిజినెస్ చేయాలనుకునే మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం బిజినెస్ చేయాలనుకునే వారికి రూ.10లక్షల నుండి రూ. 1 కోటి వరకు రుణ సదుపాయం కల్పిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం…
సొంతంగా బిజినెస్ చేసి పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునే మహిళలకు కేంద్రం ఓ అద్భుతమైన ఛాన్స్ కల్పించింది. రూ. 10 లక్షల నుండి రూ.1 కోటి వరకు రుణం అందించేలా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ‘స్టాండ్ అప్ ఇండియా’ స్కీమ్. ఈ పథకం ద్వారా లోన్ తీసుకున్నవారు మొదటి 18 నెలలు మనీ చెల్లించాల్సిన పనిలేదు. దీనితో మహిళలే కాకుండా ఎస్సీ, ఎస్టీలు అందరు రుణం పొందే అవకాశం కేంద్రం కల్పించింది. అంటే పురుషులు కూడా ఈ రుణం పొందేందుకు అర్హులే. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే పారిశ్రామికంగా ఎదగాలనుకునే మహిళలు, షెడ్యూల్ కులాల,తెగలకు వారికి ఆర్థికంగా ప్రోత్సాహం అందివ్వడమే. ఈ స్కీమ్ 2015 ఆగస్టు 15 లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు ఈ పథకం కింద 2 లక్షల 11 వేల 925 మంది లోన్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే వారిలో 1 లక్ష 91 వేల 52 మందికి లోన్ మంజూరు అయింది. మహిళలు వ్యాపారం ప్రారంభించే క్రమంలో తమ పరిశ్రమలో 10 నుంచి 15 శాతం పెట్టుబడి పెడితే చాలు.. మిగతా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ద్వారా రుణం పొందవచ్చు. గతంలో 25 శాతం పట్టుబడి పెట్టి లోన్ తీసుకునేవారు. కానీ ఇటీవలే కేంద్రం తగ్గించింది. మొదటి 18 నెలలు మారిటోరియం గడువు ఇస్తుంది. అంటే ఈ 18 నెలలు లోన్ కట్టేపని ఉండదు. ఈ లోన్ 7 సంవత్సరాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
వడ్డీరేటు ఎంసీఎల్ఆర్ రేటుకు 3% అదనంగా ఉంటుంది. వడ్డీరేట్లు 11 నుంచి 13% వరకు ఉంటుంది. రుణం పొందాలంటే ప్రాథమిక హామీతోపాటుగా స్టాండ్ అప్ ఇండియా రుణాల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ హామీ ఉండాలి. స్టాండప్ ఇండియా పథకం ద్వారా లోన్ పొందాలంటే మూడు రకాలుగా పొందొచ్చు. నేరుగా బ్యాంకుకు వెళ్ళి లోన్ అప్లై చేసుకోవచ్చు. స్టాండప్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ద్వారా కూడా లోన్ పొందవచ్చు. ఈ https://www.standupmitra.in/LDMS లింక్‌తో డిస్ట్రిక్ మేనేజర్ వివరాలు పొందవచ్చు. https://www.standupmitra.in/Login/Register లింక్‌తో నేరుగా లోన్ దరఖాస్తు చేసుకోవచ్చు.