మన దేశంలో మరో వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులతో శిశువు పుట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
వింత శిశువుల జననం గురించి వార్తల్లో చూస్తుంటాం. ఇప్పుడు రాజస్థాన్లోని చురూలో మరో వింత శిశువు జన్మించింది. రతన్గఢ్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రసవ నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మను ఇచ్చింది. అయితే పుట్టిన 20 నిమిషాల తర్వాత నవజాత శిశువు మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. హజారీ సింగ్ అనే మహిళ ప్రసవ నొప్పులతో ఆదివారం రాత్రి గంగారామ్ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు సోనోగ్రఫీ నిర్వహించారు. అందులో వింత శిశువు కనిపించిందని వాళ్లు చెప్పారు.
‘నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. అలాగే రెండు గుండెలు, వెన్నెముకలు ఉన్నాయి. పుట్టిన కొన్ని నిమిషాలకే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగానే ఉంది’ అని డాక్టర్ కైలాస్ సొంగరా పేర్కొన్నారు. ఆ మహిళ రాత్రి 8.30 గంటలకు పురిటి నొప్పులతో తమ ఆస్పత్రికి వచ్చిందని ఆయన అన్నారు. అడ్మిట్ అయిన అరగంటలోనే బిడ్డను ప్రసవించిందన్నారు. ఆమెకు సాధారణ ప్రసవం జరిగిందని.. ఈ రకంగా జన్మించడాన్ని కంజుక్టివల్ అనోమలీ అంటారని కైలాస్ సొంగరా వివరించారు. ఇది క్రోమోజోమ్ లోపం వల్ల కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.