ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే కొన్ని సార్లు దారుణాలకు పాల్పడుతున్నారు. తమ అధికార బలంతో బలహీనులపై రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజలపై పోలీసులు దాడులు చేసిన సంఘటనలు గతంలో చాలా జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ వృద్ద టీచర్‌పై ఇద్దరు మహిళా పోలీసులు దాడి చేశారు. నడి రోడ్డుపై అతడ్ని చావకొట్టారు. ఆయన కొట్టొద్దని బతిమాలుతున్నా వినకుండా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక జర్నలిస్ట్ తెలిపిన వివరాల మేరకు.. బిహార్, కైమూర్‌కు చెందిన ఓ వృద్ధుడు స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కొద్దిరోజుల క్రితం తన సైకిల్ మీద రోడ్డుపై వెళుతున్నాడు.
ఈ నేపథ్యంలో అతడు రోడ్డుపై సైకిల్ మీద నుంచి కిందపడ్డాడు. 70 ఏళ్ల వయసు కావటంతో ఆయన పైకి లేవటానికి ఇబ్బందులు పడసాగాడు. అతి కష్టం మీద పైకి లేచి నిలబడ్డాడు. ఆ ఇద్దరు మహిళా పోలీసులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనతో గొడవ పెట్టుకున్నారు. తమ వద్ద ఉన్న కర్రలతో ఆయన్ని కొట్టడం ప్రారంభించారు. ఆయన కొట్టొద్దని ఎంత బతిమాలినా వాళ్లు వినిపించుకోలేదు. ఒకరి తర్వాత ఒకరు దాడి చేశారు. అయితే, ఈ దాడిని రోడ్డుపై ఉన్న వారందరూ చూస్తూ నిలబడ్డారు కానీ, ఆపటానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను స్వాతి మలివాల్ అనే యువతి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఖాకీ డ్రెస్సు ఒంటి మీదకు రాగానే అందరూ తమను తాము రాజుల్లా భావిస్తుంటారు’’.. ‘‘ అంత వయసున్న ముసలాయన్ని కొట్టడానికి మీకు మనసెలా వచ్చింది’’.. ‘‘ ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో మామూలైపోయాయి’’.. ‘‘ పోలీసులకు ఓ న్యాయం.. ప్రజలకు ఓ న్యాయమా’’ అంటూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. ఇక, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు. అసలు వాళ్లు వృద్ద టీచర్‌ను ఎందుకు కొట్టారనే దానిపై కూడా క్లారిటీ కూడా రావాల్సి ఉంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
कैसे ये पुलिसकर्मी एक बुज़ुर्ग को डंडे से बेरहमी से पीट रही हैं 😡
बताया जा रहा है बाबा स्कूल में टीचर हैं और उनका क़सूर ये था कि इन मैडमों के सामने इनकी साइकिल गिर गई। @YadavTejashwi जी, कार्यवाही कीजिए pic.twitter.com/CxFrmVRuLJ— Swati Maliwal (@SwatiJaiHind) January 21, 2023