ఈ విద్యార్థి పేరు మిమునా. ఇటీవల పరీక్షా ఉండడంతో ఉదయం ఎగ్జామ్ సెంటర్ కు హాజరైంది. కట్ చేస్తే అదే పరీక్ష హాలులో స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే స్పందించిన కాలేజీ సిబ్బంది ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఏం చేశారో తెలుసా?
ఎగ్జామ్ అంటే చాలా మందికి భయంగానే ఉంటుంది. అయితే కొందరు పరీక్ష ఇంకా వారం రోజులే ఉందనే టైమ్ లో విద్యార్థులు అప్పుడు పుస్తకాలు తిరగేస్తూ భయందోళనకు గురవుతుంటారు. ఇలా ఎంతో మంది భయంతో పరీక్ష హాలుకు వచ్చి ఎగ్జామ్ సెంటర్ లోనే కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూసి ఉంటాం. అయితే అచ్చం ఇలాగే ఓ విద్యార్థిని ఉన్నట్టుండి పరీక్ష హాలులోనే కుప్పకూలిపోయింది. దీనిని వెంటనే స్పందించిన కాలేజ్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇకపోతే ఈ ఘటనలో పోలీసులు ఏం చేశారో తెలుసుకోవాలనుందా?
పశ్చిమ బెంగా కోల్ కతాలోని ఓ ప్రాంతంలో మిమునా (18) అనే అమ్మాయి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో చదువుకుంటుంది. అయితే ఇటీవల పరీక్షలు ఉండడంతో ఆ అమ్మాయి తండ్రి ఎగ్జామ్ సెంటర్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ యువతి పరీక్ష హాలులోకి వెళ్లి రాయడం మొదలు పెట్టిందో లేదో.. ఉన్నట్టుండి ఆ విద్యార్థిని కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే స్పందించిన కాలేజీ సిబ్బంది, స్థానిక పోలీసులు ఆ స్టూడెంట్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇక వైద్యులు చికిత్స అందించడంతో మిమునా స్పృహలోకి వచ్చింది. ఇక కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఆ అమ్మాయిని మళ్లీ పరీక్ష హాలులో వదిలి ఆమె మళ్లీ పరీక్ష రాసేందుకు తోడ్పాటును అందించారు. క్షణాల్లో స్పందించిన యువతిని మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు సాయం చేసిన పోలీసులకు ఆ యువతి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈ వార్తను చదివిన చాలా మంది నెటిజన్స్ కూడా పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.