కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక ముద్ద అన్న పెడితే చాలు.. ఆ వ్యక్తిపై విశ్వాసాని చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అవి యజమాని కోసం ప్రాణాలు కూడా అర్పిస్తుంటాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ శునకం ఘటన అందరి హృదయాలను ద్రవింప చేసింది
“కుక్కు ఉన్న విశ్వాసం నీకు లేదురా?” అని ఎవరైన మోసం చేస్తే సాధారణంగా వాడే పదం. అవును.. కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక ముద్ద అన్న పెడితే చాలు.. ఆ వ్యక్తిపై విశ్వాసాని చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అవి యజమాని కోసం ప్రాణాలు కూడా అర్పిస్తుంటాయి. అలానే ఈ మధ్యకాలంలో పెంపుడు శునకాలను పెంచుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన అందరి హృదయాలను ద్రవింప చేసింది. ఓ శునకం.. ఉరేసుకున్న తన యజమానిని బతికించుకునేందుకు ఎంతో పోరాడింది. చివరకు అది కూడా అలానే నిత్సాహాయ స్థితిలోకి వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలోని పంచవతి కాలనీలో సంభవ్ అగ్నిహోత్రి అనే 23 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. అతడు సివిల్స్ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అతడి తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వేలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇక అతడి తల్లి అనారోగ్యంతో బాధ పడుతుంది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను భోపాల్ తీసుకువెళ్లారు. దీంతో ఇంట్లో ఒంటరిగా సంభవ్‌తో వారి పెంపుడు కుక్కఅలెక్స్ ఉంది. ఆదివారం రాత్రి సమయంలో సంభవ్ తండ్రి ఆనంద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. అతడు లిఫ్ట్ చేయలేదు.
దీంతో పక్కింటి వారికి ఫోన్ చేసి.. సంభవ్ గురించి విచారించాడు. దీంతో చుట్టుపక్కల వారు ఆనంద్ వాళ్ల ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అలెక్స్ డాగ్ వారిపై దాడి చేసింది. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులను సైతం కుక్కు లోపలికి రానివ్వలేదు. 4 గంటల పాటు వారిని లోపలకి రానివ్వకుండా.. ఉరేసుకున్న యజమానిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. చివరకు చేసేది లేక ఆ పెంపుడు శునకానికి మత్తు మందు ఇచ్చి బంధించారు.
ఆ తరువాత ఇంట్లోకి ప్రవేశించి.. ఉరేసుకున్న సంభవ్ ను కింద కు దించి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యజమాని కోసం పోరాడి.. చివరకు అలెక్స్ కూడా ప్రాణాలు విడిచింది. మత్తు ఓవర్ డోస్ అవ్వడం వల్లే ఆ శునకం చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇక, సివిల్స్‌కు సన్నద్ధమవుతోన్న సంభవ్.. ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కష్టపడి చదివినా పరీక్షల్లో విజయం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైనట్టు తెలిపారు. మరి.. ఈ హృదయ విదారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.